ఎంతందంగా ఉన్నారో

నాగ చైతన్య - సమంత తొందరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. వీరిద్దరూ ఎప్పటినుండో ప్రేమించుకుని.... పెద్దల ఆశీర్వాదంతో త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట అక్టోబర్ 6 న గోవాలో పెళ్లి చేసుకుని జంటగా జీవించనున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం బయటికి తెలిసినప్పటినుండి నాగ చైతన్య - సమంత కలిసి ఎక్కడ కనబడినా... మీడియా వారిని క్లిక్ మనిపించడం చేస్తూనే వుంది. ఈ జంట అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెమస్ జంటగా మారిపోయింది. తమ తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటున్నప్పటికీ ఈ జంట తరుచు కలుస్తూ విదేశాలకు ఎగిరిపోవడం దగ్గరనుండి ఒకే ఇంట్లో కలిసి ఉండేవరకు అంతా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు.
మరి త్వరలోనే జంటగా మారబోతున్న నాగ ఛైతన్య, సమంతలు కలిసి ఒక ఈవెంట్ లో తళుక్కున మెరిశారు. 'వవెన్ 2017 ఫ్యాషన్ షో' లో ఈ జంట ని చూసిన ఎవరైనా దిష్టి పెట్టకమానరు. సమంత చేనేత చీరని స్టైలిష్ గా కట్టుకుని అందరిని మెస్మరైస్ చేస్తూ ఈ ఈవెంట్ కి హాజరవగా.... నాగ చైతన్య నార్మల్ గా, సింపుల్ గా టీషర్ట్ వేసుకుని వచ్చాడు. ఇక ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వారు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ పిక్ లో చూడండి. మరి ఆ పిక్ లో నాగ చైతన్య, సమంత తో ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తుండగా.... సమంత కూడా నాగ చైతన్యతో చనువుగా చేతులు పట్టుకుని మరి కూర్చుంది. మరి అలా ఆ జంటని చూస్తుంటే అబ్బా ఎంత బాగున్నారో అని అనిపించక మానదు. కేవలం బాగుండడమే కాదు ఈ జంట ఎంతో అందంగా వుంది కాదు అనిపిస్తుంది కూడా.
ఇక అక్టోబర్ 6,7 తారీఖుల్లో గోవాలో హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకునే ఈ జంట మరో మూడు రోజులకే తమ తమ సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవుతామని సమంత ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. దీన్ని బట్టి సమంత, నాగ చైతన్య ల హనీమూన్ ఇప్పట్లో లేనట్లే అన్నమాట.


