ఉపాసన బాగానే హెల్ప్ చేస్తుంది

ఈ మధ్యన ఉపాసన అపోలో హాస్పిటల్ పనులతో పాటు రామ్ చరణ్ తో వీకెండ్స్ ఎంజాయ్ చెయ్యడమే కాదు.... రామ్ చరణ్ కి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో పంచుకుంటుంది. రామ్ చరణ్ ని మిస్టర్ సి అంటూ ముద్దుగా చరణ్ కి సంబందించిన పర్సనల్ విషయాలతో పాటే ప్రొఫెషనల్ విషయాలను ఉపాసన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంది. మరోపక్క ఫ్యామిలీ విషయాలైన అంతే.... అటు పుట్టిల్లు, ఇటు మెట్టినిల్లు తో బాగా క్లోజ్ గా ఉండే ఉపాసన ప్రతి ఒక్క విషయాన్నీ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది.
ఉపాసన కొణిదెల ఫ్యామిలీ ట్వీట్స్ తోపాటు కామినేని ఫ్యామిలీ ట్వీట్స్ లోను ముందుంటుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి సంబందించిన రంగస్థలం షూటింగ్ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికి చేరవేస్తున్న ఉపాసన... తాజాగా మామగారు చిరంజీవి 151 వ చిత్రం సై రా నరసింహారెడ్డి సినిమా స్టార్ట్ అవుతున్న విషయంలోనూ ఒక ట్వీట్ చేసింది. మిస్టర్ సి కి నిర్మాతగా చేస్తున్న రెండో ప్రాజెక్ట్ సై రా నరసింహారెడ్డి ఈ రోజు బుధవారం సెట్స్ మీదకెళ్ళబోతున్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ విధంగా మిస్టర్ సి, చరణ్ గురించిన విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ మంచి పబ్లిసిటి చేసిపెడుతోంది ఉపాసన. చరణ్ పెంపుడు జంతువులతో ఎలా ఉంటాడు, చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటాడు. అసలు చరణ్ ఎలాంటి కాఫీ తాగుతాడు అనే విషయాల్ని అందరికి చేరవేసే ఉపాసన, ఇప్పుడు మామగారు కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి విషయాలతోను ఎప్పటికప్పుడు మెగా అభిమానులకు దగ్గరగా ఉండి సై రా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది.

