ఈసారి సినిమాలొవే వాడుతున్నారట!!

మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' చిత్రం షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. డైరెక్టర్ మురుగదాస్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ కాస్త లేటయినా కూడా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు ఈ స్పైడర్ చిత్రాన్ని. ఇప్పటివరకు పబ్లిసిటీ కార్యక్రమాలకు దూరంగా వున్న స్పైడర్ టీమ్ ఇప్పుడుపబ్లిసిటి మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మహేష్ లుక్ ని, 'స్పైడర్' టీజర్ ని విడుదల చేసిన 'స్పైడర్' చిత్ర యూనిట్ ఇప్పుడు మరో టీజర్ ని రెడీ చేసిందని చెబుతున్నారు. మొదటి టీజర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం రెండో టీజర్ తో ఇంకెన్ని సంచలనాలకు నెలవు కానుందో అంటున్నారు. మొదటి టీజర్ ని సినిమాతో సంబంధం లేకుండా కట్ చేసిన మురుగదాస్ ఇప్పుడు రెండో టీజర్ ని మాత్రం సినిమా కోసం తీసిన సీన్స్ నే వాడాలని డిసైడ్ అయ్యి ఈ రెండో టీజర్ ని రూపిందించినట్లు వార్తలొస్తున్నాయి.
మహేష్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే దసరా కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు జులై సెకండ్ వీక్ లో రెండో టీజర్ ని విడుదల చేసిన తర్వాత ఆగస్టు 9న 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ ని వదలటానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. మరి దసరాకి సినిమాని విడుదల చెయ్యాలంటే ఇప్పటినుండే ప్రచారం షురూ చెయ్యాలి గనక ఇలాంటి ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. అలాగే మహేష్ కూడా 'స్పైడర్' ప్రచారంలో పాల్గొనడానికి ప్రిపేర్ అవుతున్నాడట. రెండు తెలుగు రాష్టాలతోపాటే కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా మహేష్ స్పైడర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడని చెబుతున్నారు.

