ఈసారి దెబ్బపడినట్లే!!

అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథం' ఈ శుక్రవారమే విడుదలై యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇప్పటికే వరుస హిట్స్ తో జోష్ మీదున్న బన్నీకి ఈ యావరేజ్ టాక్ కాస్త షాక్ కొట్టిందని అంటున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి రెమ్యునరేషన్ కింద ఎంత తీసుకున్నాడనే టాపిక్ చర్చకు వచ్చింది. తానూ చేస్తున్న సినిమాలన్నీ వరసగా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుండడంతో ఈసారి బన్నీ తన రెమ్యునరేషన్ కింద ఉత్తరాంధ్ర రైట్స్ తీసుకున్నాడనే టాక్ వినబడుతుంది.
అయితే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కావడంతో తనకు అదృష్టం కలిసొస్తుందని బన్నీ అండ్ బ్యాచ్ స్కెచ్ వేసింది. కానీ ఇప్పుడు బన్నీ 'డీజే' కి మొదటి షో నుండే యావరేజ్ టాక్ రావడంతో బన్నీ అభిమానులు బాగా డీలాపడ్డారనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక 'డీజే' లో కథా లోపం వలెనే ఇలా యావరేజ్ టాక్ వచ్చిందని బలమైన కథ గనక ఉన్నట్లైతే సినిమా సూపర్ హిట్ అయ్యుండేదని అంటున్నారు.
అసలు హరీష్ శంకర్ చెప్పిన స్టోరీతో డీజేని తెరకెక్కించినా బాగుండేదని... మధ్యలో చాలా మార్పులు చేయడం వల్లే ఇలా జరిగిందని కూడా గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఈసారి బన్నీ ‘నాపేరు సూర్య’ స్టోరీ విషయంలో ఆలోచనలోపడినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల భోగట్టా.. ఈ నేపథ్యంలో 'నాపేరు సూర్య' కథని కూడా స్వల్పంగా మార్పులు చేయవచ్చని అంటున్నారు.

