ఈసారి గట్టిగానే చెప్పింది!!

ఎప్పుడు పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కి అభిమానుల నుండి ఒకే ఒక్క ప్రశ్న ఎదురవుతుంది. ఆ ప్రశ్నకి ఇప్పుడు రేణు దేశాయ్ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. తనని - పవన్ కల్యాణ్ ని ఏకం కావాలని పదేపదే ఎవ్వరు కోరవద్దంటూ అభిమానులకి ఒక బహిరంగ లేఖను రాసుకొచ్చింది. తన పర్సనల్ లైఫ్ గురించి రేణుదేశాయ్ సోషల్ మీడియా సాక్షిగా చాలా సార్లే వివరణ ఇచ్చింది. అయినా ఎప్పుడూ అభిమానులు మాత్రం రేణు - పవన్ కలిస్తే బావుండు అనే అభిప్రాయలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
అందుకే రేణు మరోసారి చాలా స్పష్టంగా తన ఒపీనియన్ని ఇలా బహిరంగ లేఖ ద్వారా బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ నాకు విడాకులిచ్చి నాలుగేళ్ల కిందట అన్నాను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూతురుకి జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను.. పవన్ కళ్యాణ్ తిరిగి ఏకం కావాలని పదేపదే మీరు కోరవద్దు. దయచేసి మీరంతా దాని అర్థం చేసుకొని ఆమోదించాలి. కానీ ఒకటి మాత్రం నిజం..... పవన్ నా పిల్లలకు తండ్రి. అలాగే నేను కళ్యాణ్ మంచి స్నేహితులం మాత్రమే.. కాని మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం ఉండలేము.
ఈ నిజాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరో వివాహ బంధంలోవున్న ఆయన దగ్గరకు తిరిగి నేను మళ్ళీ వెళ్లడం అనేది సమంజసం కాదు. అది ఎప్పటికి సాధ్యం కాదు. ఇక జీవితంలో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే కోరికలేవీ మీనుంచి ఎదురుకావని ఆశిస్తున్నాను అంటూ పవన్ అభిమానులకి సుదీర్ఘ లేక రాసింది. మరి నిజంగానే రేణు చెప్పినట్టు ఇంతటితోనైనా అభిమానులు అలా వారిద్దరూ కలిసి ఉండాలనే కోరికను చంపేసుకుంటేనే బెటర్ లేకుండా మళ్ళీ మళ్ళీ రేణు ఇలాంటి క్లారిటీలు ఇవ్వలేదుకదా...!!

