ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు!!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు మొదటి సినిమా ఫలితం ఎలాగున్నా రెండో సినిమా 'అతనొక్కడే' సినిమాతో హిట్ కొట్టినప్పటినుండి మళ్ళీ ఆ రేంజ్ హిట్దే లేకపోయినప్పటికీ అలాగే ఇండస్ట్రీలో హీరోగా ట్రై చేస్తూనే మధ్య మధ్యలో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారిన కళ్యాణ్ రామ్ మళ్లీ పదేళ్లకు 'పటాస్' తో హిట్ కొట్టాడు. 'పటాస్' తర్వాత సిక్స్ ప్యాక్ ట్రై చేసిన 'ఇజం' సినిమా ప్లాప్ తో ఖంగుతిన్న కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'మంచి లక్షణాలున్న అబ్బాయి’ చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా తన తమ్ముడు ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమాని నిర్మిస్తున్నాడు.
కొత్త దర్శకుడి ఉపేంద్ర మాధవన్ తో 'ఎమ్మెల్యే' చిత్రాన్ని చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. మరో హీరోయిన్ మనాలి రాధోడ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాడని... అలాగే ఈ చిత్రంలో కొత్తదనం కోసం చిత్ర టీమ్ ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో యాక్షన్ సీన్స్ ను రూపొందిస్తున్నారట. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర టీమ్.
అలాగే ఈ ఫైట్ రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకు చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ప్రస్తుతానికి ఈ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ చిత్రీకరణ జరుపుకుంటుంది.

