ఈసారి కూడా సీక్రెటేనా...!

ప్రియమణి హీరోయిన్ గా సినిమాలకు దూరమై చాల కాలమే అయ్యింది. ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో..... బాలీవుడ్ లో 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించనప్పటినుండి అక్కడ డాన్స్ షో లకు జడ్జ్ గా వ్యవహరించడమే కాకుండా ఇప్పుడు తాజాగా ప్రియమణి ప్రముఖ టీవీ ఛానల్ లో ఢీ ప్రోగ్రాం కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అయితే కన్నడ, మలయాళంలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న ప్రియమణి ఎటూ హీరోయిన్ గా సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడంతో గత ఏడాది మేలో ఫ్రెండ్ ముస్తాఫా రాజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఎంగేజ్మెంట్ అయ్యి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు పెళ్లి ఊసెత్తకుండా అమ్మడు తన పనుల్లో బిజీగా వుంది.
అయితే ఇప్పుడు తాజాగా మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేసింది ప్రియమణి. తన పెళ్ళి ఎటువంటి హంగుఆర్భాటలు లేకుండా ఈనెల 23న బెంగళూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనుందని......ఆ తర్వాత 24న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిసెప్షన్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గానే తన నిశ్చితార్ధం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు కూడా ఇలాగే పెళ్ళిని కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. మరి రిసెప్షన్ అన్నా అందరికి ఇస్తే బావుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రియమణి సన్నిహితులు.

