ఈయన ఇక సెలవు తీసుకోవటం మంచిదేమో

2016 సంక్రాంతి కి కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, 2017 సంక్రాంతికి మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 , ఈ ఏడాది సంక్రాంతి కి నటసింహం నందమూరి బాల కృష్ణ నటించిన జై సింహ. గత రెండు సంవత్సరాలలో సంక్రాంతికి విడుదలైన ఈ పెద్ద హీరోల చిత్రాలు విజయం సాధించాయి. ఈ ఏడాది కూడా జై సింహ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ విజయం దిశగా ముందుకు సాగుతుంది. దాదాపు ప్రతి దర్శకుడు, ప్రతి నిర్మాత తోపాటు ప్రతి స్క్రిప్ట్ రైటర్ వారి రచనల్లో బ్రహ్మానందం కి పాత్ర ఉండేలా చూసుకునే రోజుల నుంచి కేవలం సీనియర్ హీరోస్, అది కూడా వారి కంఫర్ట్ జోన్ లో చిత్రాలు అయితేనే బ్రహ్మానందం కి పాత్ర ఇప్పించే లేదా ఇరికించే పరిస్థితి.
సోగ్గాడే చిన్ని నాయనా. ఖైదీ నెం.150 ఎంత పెద్ద విజయాలు సాధించినప్పటికీ ఆ విజయాలలో బహ్మానందం పాత్ర మచ్చుకైనా లేదనటంలో అతిశయోక్తి లేదు. తెరపై ఆయన కనిపిస్తే నవ్వే రోజుల నుంచి తెర పై ఆయన ప్రెజన్స్ కి విరక్తి చెందే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. జై సింహ లో కనిపించిన బ్రహ్మానందం కనీసం ఒక్క సంధర్బములో కూడా ప్రేక్షకుల పెదవుల పై నవ్వులకి కారణం కాలేకపోయాడు. మరో వైపు తమిళ అనువాద చిత్రం గ్యాంగ్ లో ఒకే ఒక్క సన్నివేశం లో కనిపించే బ్రహ్మి రమ్య కృష్ణ ని చూస్తూ చేసే వెకిలి చేష్టలు, వెకిలి ఎక్స్ప్రెషన్స్ కి ఆ సన్నివేశంలో హాస్యమే పండలేదు. ఎలానో నేటి తరం దర్శక రచయితలు బ్రహ్మి కోసం పాత్రని పనికట్టుకుని తమ కథలలో ఇరికించలేరు. ఇక ఇలా అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ ఆ త్యాగం చేసినా అవి ఫలించటం లేదు. ఇక ఇప్పటికైనా బ్రహ్మి సెలవు తీసుకోవటమే ఉత్తమమేమో మరి..

