ఈ హీరో ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూసారా?

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు... సినిమాల్లో బాగానే బిజీ అయ్యాడు. మహేష్ బాబు స్టార్ హీరో హోదాలో ఉన్నప్పటికీ బావ సుధీర్ బాబు మాత్రం మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. తన స్థాయికి సరిపడా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న సుధీర్ బాబు న్యూ ఇయర్ సందర్భంగా మంచి మంచి ప్లాన్స్ చేసుకోవడమే కాదు అవి అభిమానులతో కూడా పంచుకున్నాడు. గత ఏడాది తనని ఎలా ఆదరించారో ఈ ఏడాది కూడా అభిమానులంతా తనని అలా ఆదరించాలని... ఈ ఏడాది అంటే 2018 లో తన నుండి కచ్చితంగా రెండు మూడు సినిమాలొస్తాయని చెబుతున్నాడు.
ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీతలైన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రవీణ్ సత్తారు లతో కలిసి సినిమాలు చెయ్యబోతున్నానని.. అంతేకాకుండా ఇంద్రసేన, ఆర్ఎస్ నాయుడు అనే కొత్త దర్శకులతో కూడా తన సినిమాలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తాను హీరోగా కొనసాగుతూనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి సినిమాలు చేస్తానని చెబుతున్న సుధీర్ బాబు.. ఆ నిర్మాణ సంస్థ ని సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట స్థాపించబోతున్నట్టుగా ప్రకటించాడు.

మరి హీరోగా బయట నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తూనే తన బ్యానర్ లో చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ నిర్మాత అవతారమెత్తడానికి రెడీ అయ్యాడు ఈ హీరో. అయితే సుధీర్ బాబు చెబుతున్న ఇద్దరు కొత్త దర్శకులైన ఇంద్రసేన, ఆర్ఎస్ నాయుడు లలో ఒకరిని తన సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే వెండితెరకు పరిచయం చేయబోతున్నాడట.

