ఈ రోజు సాయంత్రంలోగానే శ్రీదేవి అంత్యక్రియలు

ప్రముఖ నటి శ్రీదేవి నిన్న రాత్రి దుబాయ్ లో కన్ను మూసారు. ఆమె హఠాన్మరణంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఆమె బాలీవుడ్ తో పాటు టాలీవుడ్..కోలీవుడ్ లో చాలా సినిమాలు చేసారు. తెలుగు లో ఎన్టీఆర్ దగ్గర నుండి వెంకటేష్ వరకు అందరి హీరోస్ తో నటించిన అనుభవం ఉంది ఆమెకు. శ్రీదేవికి టాలీవుడ్ అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దుబాయ్ లో ఫామిలీ ఫంక్షన్ కి వెళ్లిన శ్రీదేవి అక్కడే తుదిశ్వాస విడిచారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబై చేరుకోనుందని సమాచారం. ఈ సాయంత్రంలోగానే ఆమె అంత్యక్రియలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముంబైలో శ్రీదేవి నివాసం వద్దకు అభిమానులు..సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. తాము ఎంతగానో ఆరాధించే శ్రీదేవిని చివరి చూపు చూసుకోవాలని ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటున్నారు. టాలీవుడ్ నుండి సినీ ప్రముఖులు ముంబైకి బయలుదేరనున్నారు

