ఈ రెండు తర్వాత... ఆ డెరెక్టర్ తోనే సినిమా చేస్తాడా?

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, నానితో 'నేను లోకల్' సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా వచ్చి దాదాపు 5 నెలలు దాటుతున్నా త్రినాథరావు నక్కిన మరో సినిమా చేస్తున్నట్లు ఎక్కడా ప్రచారం జరగడం లేదు. అసలు త్రినాథరావు ఏ హీరోతో సినిమా చేస్తాడో కూడా తెలియడంలేదు. మరోపక్క 'నేను లోకల్' మాటల రచయిత ప్రసన్నకుమార్ మాత్రం మరో కొత్త కథని రెడీ చేసే పనిలో నిమగ్నమైనట్టు... అది ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నట్టు వార్తలొస్తున్నాయి
అయితే ప్రసన్న కుమార్ కొత్త కథతోనే దర్శకుడు త్రినాథరావు, రామ్ చరణ్ ని తెరకెక్కించే చేసే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అయితే త్రినాథరావు ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మాణంలోనే చేస్తాడనే టాక్ వినబడుతుంది. అలాగే రామ్ చరణ్ తో ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇక ఈ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో త్రినాథరావు నక్కిన, రైటర్ ప్రసన్న కుమార్ లు ఉన్నారని చెబుతున్నారు.
అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కారణం దర్శకుడు త్రినాథరావు, ప్రసన్నకుమార్ లు ఇద్దరూ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడమే. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం, సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం 1985 ' చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. అలాగే 'రంగస్థలం' పూర్తికాగానే చరణ్, కొరటాల మూవీలో నటించాల్సి ఉంది. అంటే ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే రామ్ చరణ్, దర్శకుడు త్రినాథరావు నక్కినతో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళతాడేమో మరి. వెయిట్ అండ్ సి!!

