ఈ పోస్టర్ చూస్తుంటే లై సినిమా గుర్తొస్తుంది!

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమాలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో .. నితిన్ హీరోగా వస్తున్న 'చల్ మోహన్ రంగ' సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఏదో కొత్తగా తీయబోతున్నారు అని అర్ధం అవుతుంది . ఈ టీజర్ కు మంచి స్పందన కూడా వచ్చింది.
టీజర్ తర్వాత ఓ సాంగ్ రిలీజ్ చేసారు. థమన్ అందించిన మ్యూజిక్ కి అందరు ఫిదా అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. సో టీం ప్రొమోషన్స్ స్టార్ట్ చేసి పోస్టర్స్ వదులుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నితిన్ - మేఘా ఆకాష్ లు ఇద్దరూ కనిపిస్తారు. కనెక్ట్ చేసిన రెండు రైలు బోగీలకు అటూ ఇటూ కూర్చుని ఒకరివంక ఒకరు చూసుకుంటూ కనిపిస్తారు. విజువల్ లో ఈ పోస్టర్ చాలా బాగుంది.
ఇటువంటి పోస్టర్ ఏ నితిన్ గత చిత్రం లై లో కూడా ఇలాగే ట్రైన్ దగ్గర ఓ సీన్ ఉంటుంది. అందులో కూడా నితిన్ - మేఘ ఆకాష్ జంటగా నటించారు. దీంతో చల్ మోహన్ రంగ పోస్టర్ చూస్తున్న.. లై పోస్టర్ చూస్తున్న ఒకేలా ఉందని.. ఏదో కొత్త సినిమా పోస్టర్ చూస్తున్న ఫీలింగ్ రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రమోషన్ పోస్టర్స్ లో ఇలాంటి పోలికలు కనిపించకుండా చూడడం బెటర్.

