ఈ ఏడాదంతా ఈ హీరోయిన్ దే

ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చేస్తానని చెప్పడమే కాదు.. అన్నట్టుగా పెళ్లి వయసు రాగానే కెరీర్ గురించి ఆలోచించకుండా తాను ప్రేమించిన నాగ చైతన్య ని ప్రేమ వివాహం చేసుకున్న సమంత కెరీర్ లోను అంతే స్పీడుగా దూసుకుపోతుంది. గత ఏడాది ప్రేమ పెళ్లి చేసుకున్న సమంత సినిమాలు మాత్రం పెద్దగా విడుదల కాలేదు. తమిళంలో విజయ్ తో నటించిన మెర్సల్, తెలుగులో గెస్ట్ గా చేసిన రాజుగారి గది 2 విడుదల కాగా... ఈ ఏడాది మాత్రం మొత్తం సమంతదే అన్నట్టుగా ఉన్నది.. ఆమె నటించిన సినిమాల లిస్ట్ చూస్తుంటే.
2018 లో సమంత తెలుగులో నటిస్తున్న రంగస్థలం, మహానటి సినిమాలు కొద్దీ రోజుల గ్యాప్ లో మార్చ్ నెలాఖరున విడుదలవుతుంటే... తమిళంలోనూ సమంత తన హవా చూపించేస్తుంది. కోలీవుడ్ లో విశాల్ సరసన నటించిన అభిమన్యుడు, సూపర్ డీలక్స్ సినిమాలు కూడా ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే విడుదల కాబోతున్నాయి. మరి చేతినిండా సినిమాలతో యమ బిజీగా వున్నా సమంత మరోవైపు నిర్మాతగా కూడా మారనుంది. తాను నిర్మాతగా, హీరోయిన్ గా చెయ్యబోయే యు టర్న్ సినిమా కూడా ఈ ఏడాదే పట్టాలెక్కబోతుంది.
ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లోనే విడుదలకు సిద్ధం చేయబోతుంది సమంత. అలాగే కోలీవుడ్ లో శివ కార్తికేయన్ పక్కన నటిస్తున్న సమంత.... ఆ సినిమా కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే విడుదలకు సిద్దమవుతుంది. మరి ఈలెక్కన సమంత కి ఈ ఏడాది తిరుగులేదని చెప్పాలి. ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సమంత ఈ ఏడాది సాధిస్తుందని సామ్ అభిమానులు హ్యాపీ గా వున్నారు.

