ఈ ఆఫర్ తో అయినా నిలదొక్కుకుంటుందా.

తెలుగులో అందాలు ఆరబోసినా పని జరగడం లేదు. ఎప్పుడూ లేని అందాలతో మత్తెక్కిస్తున్న దర్సకనిర్మాతల చూపుని తనవైపు తిప్పుకోలేకపోతుంది సెక్సీ భామ రెజినా. కెరీర్ లో పది కాలాలు గుర్తుండిపోయే సినిమా చెయ్యలేని ఈ భామ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే వుంది. మరి ఈ మధ్యన రెజినా నటించిన సినిమాలేవీ బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోతున్నాయి. నిన్నగాక మొన్నొచ్చిన అ! సినిమాలో కూడా రేజీనాకి... ఆ సినిమాలో నటించిన అందరికన్నా తక్కువ మార్కులే పడ్డాయి. టాలీవుడ్ లో అడపా దాదాపు నటిస్తూనే.. కోలీవుడ్ లో కూడా అవకాశాలు పట్టేస్తున్న రెజినా కి ప్రస్తుతం బాలీవుడ్ ఆశలు కూడా చిగురిస్తున్నాయి.
ఏదో ఆ ఆమద్యన బాలీవుడ్ లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారినా.. ప్రస్తుతం మాత్రం ఒక మంచి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. గతంలో ఆంఖేయిన్ 2 తో రేజీనా మంచి ఛాన్స్ వచ్చినా.. రెజినా బ్యాడ్ లాక్కో మరేదో కారణం వలనో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో నిరాశ చెందిన రేజీనాకి మళ్ళీ ఇంతకాలానికి మరో బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టింది. రాజ్ కుమార్ రావ్, అనిల్ కపూర్, జుహీ చావ్లా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఏక్ లడ్కికో దేఖతో ఐసా లగా సినిమాలో రెజినాకు మంచి అవకాశం దక్కినట్లుగా వార్తలొస్తున్నాయి. చాలామంది కథానాయికలకు ఆడిషన్స్ నిర్వహించిన దర్శకుడు షెల్లీ చోప్రధర్ చివరకు ఆ పాత్ర కోసం రెజీనానే ఖరారు చేశాడట.
మరి ఈ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రెజీనా బాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తే ఆమెకి తిరుగుండదు. కానీ అక్కడ కూడా అలా అలా ఆ సినిమాకి టాక్ వచ్చిందా ఇక రెజీనా కెరీర్ ని ఎవ్వరు కాపాడలేరు. ఆమె ఇక సినిమా అవకాశాలు లేక గోళ్లు గిల్లుకోవాల్సిందే.

