ఈ అర్జున్ తో అర్జున్ రెడ్డి రీమేకా?

గత ఏడాది యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన తొలి బోల్డ్ ప్రయత్నం అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. ఈ చిత్రం విడుదల రోజుకి ముందు రాత్రే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శనలతో మొదలై విజయ్ సాయి దేవరకొండ వంటి స్టార్ స్టేటస్ లేని ఒక హీరో చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ అన్ని హౌస్ ఫుల్స్ అయ్యాయంటే ఈ చిత్రానికి యువత లో వున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తరువాత ఈ చిత్రం చేసిన సంచలన వసూళ్లు కూడా అర్జున్ రెడ్డి స్థాయిని చిరస్ధాయి గుర్తింపుగా నిలిపింది.
తెలుగు సినిమా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇతర భాషల నుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ వుంది. ఇప్పటికే తమిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ కథానాయకుడిగా బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఖరారు కాగా, కన్నడ లో హీరో ఎంపిక ఇంకా జరుగలేదు. మరో వైపు చాలా కాలంగా బాలీవుడ్ నుంచి ఈ రీమేక్ విషయమై దర్శకుడు సందీప్ రెడ్డి కే దర్శకత్వ అవకాశం ఇస్తూ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ దర్శకత్వానికి సందీప్ రెడ్డి వంగ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన హీరోగా అర్జున్ కపూర్ ని ఎంపిక చేసుకోనున్నట్టు సమాచారం. బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నప్పటికీ అర్జున్ కపూర్ యాక్టింగ్ ఇంటెన్సిటీ పై అనుమానాలు వున్న ఒక వర్గ ప్రేక్షకులు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కి అర్జున్ కపూర్ కరెక్ట్ ఛాయిస్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మరి సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ కి ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.

