ఇలియానా బాగా ముదిరింది

టాలీవడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఇక్కడ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూనే బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అక్కడ ఎంటర్ అయిన సినిమాతోనే హిట్ కొట్టి... అక్కడే పాతుకుపోవాలని చూసింది. కానీ ఇలియానా ప్లాన్ వర్కౌట్ అవ్వనివ్వలేదు సదరు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. మధ్య మధ్యలో బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ ఇక్కడ సౌత్ కి కూడా వస్తూ పోతూ ఉండే ఇలియానా కి ఈ ఏడాది రెండు బాలీవుడ్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం వచ్చింది. ఇక ఆ రెండు సినిమాలతో అక్కడ జెండా స్ట్రాంగ్ గా పాతడానికే కాచుకుని కూర్చుంది ఇలియానా.
అయితే ఇలియానా నటించిన బాలీవుడ్ ఫిలిం ముబారకన్ కి పెద్దగా పేరు రాకపోయినా ఇలియానా అందాలకు మాత్రం అదిరిపోయే పేరొచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి హీరోలుగా ఇలియానా లీడ్ రోల్ లో నటిస్తున్న బాద్షాహో ఫిలిం సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్దమవుతుంది. బాద్షాహో ట్రైలర్ లో ఇలియానా అందాల ఆరబోత ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. ట్రైలర్ లోనే ఇంత గ్లామర్ షో చేసిన ఇల్లి బేబీ... ఇక సినిమాలో ఎలా రెచ్చిపోయిందో అనే హాట్ డిస్కార్షన్లో ఉన్నారు బాలీవుడ్ జనాలు.
ఇకపోతే బాద్షాహో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ఇలియానాకి ఒక ఘాటైన ప్రశ్న ఎదురుకాగా దానికి ఇలియానా కూడా కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. సినిమా ఛాన్సుల కోసం ఇతరులతో స్వీట్ గా మాట్లాడతారా? అనే ప్రశ్నకు ఇలియానా కూడా గట్టిగానే తన సమాధానం చెప్పింది. కేవలం ఛాన్సుల కోసం నేను ఇతరులతో అందంగా మాట్లాడుతూ... పక్క వారిని పొగడ్తలతో ముంచెత్తి ఛాన్సులు దక్కించుకోవడం అనేది ఛండాలంగా ఉంటుందంటూ సమాధానం చెప్పింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండడం చూసిన నాగురించి అలాంటి అభిప్రాయం ఉండడం తప్పు అంటుంది.

