ఇప్పుడు వారిదే హావా

బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ లోని భారీ బడ్జెట్ సినిమాల్లో విలన్స్ గా నటించి సత్తా చాటుతున్నారు.ఆ మధ్యన అజిత్ సినిమా వివేగం లో వివేక్ ఒబెరాయ్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. అలాగే ఇప్పుడు తాజాగా రజినీకాంత్ - శంకర్ ల రోబో 2.0 లో కూడా అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. ఆ సినిమా విడుదలకు రెడీగా ఉంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల హోదాను అనుభవిస్తున్నప్పటికీ సౌత్ లో స్టార్ హీరోల సినిమాల్లో వీరు విలన్స్ గా తెగ మెప్పించేస్తూ కొత్త దనాన్ని చూయిస్తున్నారు. ఇక తాజాగా వివేక్ ఒబెరాయ్, బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా తెలుగు తెరకు కూడా పరిచయం కాబోతున్నాడు.
మరి అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ లే కాదు ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా సౌత్ ప్రాజెక్ట్ లో విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. అది కూడా కమల్ హాసన్ - శంకర్ కలయికలో తెరకెక్కనున్న ఇండియన్ 2 లో అజయ్ దేవగన్ సౌత్ తెరకు విలన్ గా పరిచయం కాబోతున్నాడు. రోబో 2.0 కోసం శంకర్ మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని విలన్ గా తెచ్చినట్టే.. ఇప్పుడు శంకర్ - కమల్ కొత్త చిత్రం ఇండియన్ 2 కోసం అజయ్ దేవగన్ ని విలన్ గా తీసుకురాబోతున్నాడు. మరి శంకర్ - కమల్ కలయికలో తెరకెక్కబోయే ఈ భారీ బడ్జెట్ త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది.
అజయ్ దేవగన్ ఈ మూవీ ద్వారా విలన్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం అతనికి ఇదే మొదటి సౌత్ సినిమా అవుతుంది. మరి గతంలో శంకర్ - కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు లైకా ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ ఇండియన్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి కమల్ హాసన్ తన కొత్త పార్టీ పనులతో రాజకీయాల్లో బిజీగా వున్నాడు. మరి కమల్ కొంచెం ఖాళీ అయితే గాని ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదు.

