ఇప్పుడు గనక అయితే 500 కోట్లు కొల్లగొట్టేసేది!!

ఇపుడు ఇండియన్ సినిమా మార్కెట్ అంతా 500 కోట్లు, 1000 కోట్ల క్లబ్బులు సృష్టించేస్తూ తెగ హడావిడి చేసేస్తుంది. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమా కూడా ఇప్పుడు 500 ఏం ఖర్మ 1500 కోట్ల మార్కెట్ ని సెట్ చేసి అదరహో అనిపించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇలా 500 , 1000 , 1500 కోట్ల మార్కెట్ ని సెట్ చేస్తుంటే అప్పట్లో అంటే సీనియర్ ఎన్టీఆర్ కాలంలోనే ఈరేంజ్ మార్కెట్ ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రికార్డులను తుడిచిపెట్టేసి ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలు అయిన లవ కుశ, దాన వీర సుర కర్ణ చిత్రాలను కోటి మార్క్ ని అందుకుంటే ఒక పక్కా కమర్షియల్ చిత్రం అయిన అడవిరాముడు ఆ కోటి మార్క్ ని దాటేసి ఏకంగా 4 కోట్ల గ్రాస్ సాధించి అదరహో అనిపించింది.
అడవిరాముడు అదరహో....
అసలు అడవిరాముడులో ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో... అనేది ఇప్పటితరం వారిని అడిగినా టక్కున చెప్పేస్తారు. అలాంటి అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. అప్పట్లోనే అడవిరాముడు సినిమా ఒక ఏడాది పాటు ఏకధాటిగా ఆడి చరిత్ర సృష్టించడమే కాదు... ఏ ఇతర భాషల్లోనూ కలెక్ట్ చెయ్యని కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే అది 4 కోట్ల గ్రాస్ సాధించింది అంటే గనక ఇప్పుడు ఈ కాలంలో ఆ కలెక్షన్స్ తో పోలిస్తే... మాత్రం ఖచ్చితం 500 కోట్ల కలెక్షన్స్ అని చెప్పొచ్చు అంటున్నారు. అప్పట్లో రూపాయల్లో టికెట్స్ ధరలుంటే... ఇప్పట్లో 100 ల్లో టికెట్స్ ధరలు ఉన్నాయి. మరి అప్పటి కలెక్షన్స్ ని ఇప్పుడు కరెన్సీలో లెక్కలేస్తే అలా 500 కోట్ల గ్రాస్ అడవిరాముడు కొల్లగొట్టేదని అంటున్నారు. మరి సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే 500 కోట్ల మార్కెట్ ని సృష్టించినట్లేగా. అదండీ విషయం.
- Tags
- అడవిరాముడు

