ఇదేం కల బాబు

శర్వానంద్ ఇప్పుడు తన కెరీర్ ని చక్కగా మలుచుకుంటున్నాడు. ప్రేమ కథా చిత్రాలు, కుటుంబకథా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటున్నాడు శర్వానంద్. పెద్ద హీరోలకు ధీటుగా పండగలప్పుడు తన సినిమాలను విడుదల చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోకి ఒక కోరిక ఉందట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనేది శర్వానంద్ కల అంట. పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోలని చాలా డిఫరెంట్గా చూపిస్తాడని... పోకిరి స్టయిల్ తనకి నచ్చుతుందని... చెబుతున్నాడు. అందుకే పూరితో సినిమా చేస్తే ఖచ్చితంగా తనని డిఫరెంట్గా చూపిస్తాడని...., ఆయనతో పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని డైరెక్ట్ గా తన కోరికను పబ్లిక్ గా చెప్పేసాడు శర్వానంద్.
మరి శర్వానంద్ కోరిక పెద్దదేమీ కాదుగాని.. ప్రస్తుతానికి దర్శకుడు పూరికి విజయాలు దరిచేరడం లేదు. గత కొంతకాలంగా ప్లాపుల బాట పట్టిన ఈ దర్శకుడితో, సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న శర్వానంద్ సినిమా చేయాలనుకోవడం పెద్ద విశేషమే. అయితే ఇప్పుడు ఏ ఒక్క స్టార్ హీరో కూడా పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. అలాంటి ఈ టైంలో శర్వానంద్... పూరితో సినిమా తీస్తే అతని కెరీర్ కి బాగా దెబ్బ పడుతుంది అని అంటున్నారు శర్వా అభిమానులు. కాని కొంత మంది విమర్శకులు మాత్రం శర్వానంద్ ఈ క్లీన్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి అనే ప్రాసెస్ లో పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పాడేమో అంటున్నారు.
మరి కొత్త స్టయిల్, కొత్త ఇమేజ్ కోరుకుంటున్న శర్వానంద్ కొంచెం పేరున్న మాస్ డైరెక్టర్ ని ఎంచుకుంటే బావుంటుంది కానీ.. మరీ ఇలా వరుస ప్లాప్స్ ఉన్న డైరెక్టర్ మీద మోజు పడడం కరెక్ట్ కాదంటున్నారు.

