ఇది నిజమా డార్లింగ్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోయిన్ తోను ఎఫైర్ లేదు. కాని మూడు నాలుగు సినిమాల్లో కలిసి నటించిన అనుష్క కి ప్రభాస్ కి మాత్రం ఎఫ్ఫైర్ ఉందని సోషల్ ఇండియాలో కథనాలు వెలువడుస్తున్నాయి. అయితే అనుష్క తో తనకి లవ్ ఎఫ్ఫైర్ లేదని.... అదంతా అబద్దమని ప్రభాస్ చాలా సార్లు చెప్పాడు. ఇక అనుష్క కూడా ప్రభాస్ తో లవ్ ఎఫ్ఫైర్ లేదని... తేల్చి చెప్పేసింది. అటు ప్రభాస్ ఇటు అనుష్క కూడా తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతున్నారు. అసలు వారిద్దరూ మాత్రం మంచి స్నేహితుల్లా ఉండడానికి ఇష్టపడతారని సినీ వర్గాల్లో మంచి టాక్ ఉంది.
అయితే ఇప్పుడు ప్రభాస్ చేసే పనులు.. ఇటు అనుష్క చేసే పనులు చూస్తుంటే మాత్రం వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ మళ్ళీ రూమర్స్ బయలుదేరాయి. వారిమధ్యన ఎఫ్ఫైర్ ఉందనడానికి ప్రూఫ్ లు కూడా చూపెడుతున్నారు. గత నెలలో లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అనుష్క.... ప్రభాస్ కి లేటెస్ట్ ట్రెండీ వాచ్ లంటే చాలా ఇష్టమని చెప్పి ఒక ఖరీదైన రిస్ట్ వాచ్ ను గిఫ్ట్ గా ఇవ్వడం చూసాక... చూసారా అనుష్క అంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం చూసాక కూడా వాళ్ళ మధ్యన ఏం లేదంటారేమి అంటున్నారు.
అలాగే ఇప్పుడు తాజాగా నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్బంగా ప్రభాస్ కూడా అనుష్క కి ఒక అదిరిపోయే ఖరీదైన గిఫ్ట్ ని ప్రెసెంట్ చేసాడు అని ప్రచారం జరుగుతుంది. అవును అనుష్క కోసం ప్రభాస్ ఏకంగా బీఎం డబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చాడని ఫిలింనగర్ సర్కిల్స్ లో లేటెస్ట్ న్యూస్. మరి ఇలా ఖరీదైన గిఫ్ట్ లు మార్చుకుంటున్న వీరిమధ్యన ఏం లేకపోవడమేమిటి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి ఈ వార్తలపై ప్రభాస్, అనుష్క ఎలా స్పందిస్తారో చూడాలి.

