ఇతర కథానాయికలకు అనుష్కకి వున్న వ్యత్యాసం ఇది

ఇప్పటి వరకు చాలా మంది కథానాయికలు మీడియా తో ఓపెన్ అవుతూ చిత్ర పరిశ్రమలో హీరోలతో పాటు తాము కూడా పనిచేస్తున్నప్పటికీ ఒక్కో చిత్రానికి హీరోలు అందుకునే పారితోషికాలు తాము అందుకునే దానికంటే కొన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని, ఇది తమకి జరుగుతున్న అన్యాయం అని గగ్గోలు పెడుతూ సినిమా పరిశ్రమని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ గా అభివర్ణిస్తూ అనేకానేక సందర్భాలలో అనేక మంది పాపులర్ కథానాయికలు సైతం ఆరోపణలు చేశారు.
ఈ శుక్రవారం విడుదల కానున్న భాగమతి చిత్ర ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న అనుష్క ని మీడియా ప్రతినిధులు హీరోల అధిక పారితోషికాల విషయంపై స్పందన కోరగా, "కథానాయికల కంటే హీరోలకి ఎక్కువ పారితోషికాలు వుంటూ ఉంటాయి. ఇది సహజ పరిణామం. హీరోయిన్స్ కంటే ఎక్కువ సినిమా ని తమ భుజస్కంధాల పై నడిపే వారు హీరోలు. పైగా హీరో క్రేజ్ ని బట్టి సినిమా ని చూసే ప్రేక్షకుల సంఖ్య లో మార్పు, సినిమా కి వచ్చే ఓపెనింగ్స్ లో తేడాలు ఉంటాయి కానీ వాటి పై కథానాయికలు ఎక్కువగా ప్రభావం చూపలేరు. హీరోల క్రేజ్ పై సినిమా మార్కెట్ జరుగుతున్నప్పుడు వారు అధిక పారితోషికాలు అందుకోవటం తప్పు కాదు కదా!" అంటూ వివరిస్తూ హీరోలకి సమానంగా ఇమేజ్ పొంది అరుంధతి వంటి చిత్రాలని అన్ని తానై నడిపిన అనుష్క తన ఔన్నత్యాన్ని చాటుకుంది.

