ఇటు టాలీవుడ్ ని.. అటు బాలీవుడ్ ని పడేసాడు!!

నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లై' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కారణం నితిన్ గత చిత్రాలు హిట్స్ ఒకటైతే మరొకటి హను రాఘవాపుడి డైరెక్షన్. రెండు లవ్ స్టోరీలతో సినిమాలు చేసిన హను ఇప్పుడు నితిన్ తో లవ్ కమ్ యాక్షన్ మూవీ 'లై' ని నితిన్ - మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిస్తున్నాడు. అయితే 'లై' చిత్రం రొమాంటిక్ కమ్ యాక్షన్ అని ఎందుకు అన్నామంటే 'లై' టీజర్ చూస్తుంటే నితిన్, హను రాఘవపూడి కూడా కొత్తగా ట్రై చేస్తున్నారనే చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రంలో నితిన్ ఎప్పటిలా ఒకే లుక్ ని మైంటైన్ చెయ్యకుండా చాలా స్టైలిష్ గా యాక్షన్ లుక్ లో అలరిస్తున్నాడు. భారీగా గెడ్డం పెంచినప్పటికీ నితిన్ పేస్ లో ఆ గెడ్డం అందంగానే కనబడుతుంది. మరి నితిన్ లుక్ లో మంచి యాక్షన్ లుక్ కనబడుతుందని అంటున్నారు. ఇక సీనియర్ హీరో అర్జున్ కూడా స్టైలిష్ లుక్ తో ఎంతో గంభీరంగా కనబడుతున్నాడు. నితిన్ గత చిత్రాలకు 'లై' చిత్రానికి చాలా తేడా ఉందనే క్యూరియాసిటీని ఈ 'లై' టీజర్ తో కలుగజేసింది చిత్ర యూనిట్. ఇక 'లై' టీజర్ లోని మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి.
నితిన్ 'లై' టీజర్ ని టాలీవుడ్ వారంతా తెగ పొగిడేస్తున్నారు. ఒక్క టాలీవడ్ వాళ్ళు మాత్రమే నితిన్ 'లై' ని ఫోకస్ చెయ్యలేదు... బాలీవుడ్ వాళ్ళు కూడా నితిన్ 'లై' ని ఫోకస్ చేశారు. బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ అయిన తరణ్ ఆదర్శ్ నితిన్ టీజర్ వీక్షించానని మీ కంటిని మీ దృష్టిని రెండింటినీ ఆకర్షించే 'లై' ఇదిగో అంటూ ట్వీట్ చేసాడు. మరి తరుణ్ ఆదర్శే నితిన్ 'లై' టీజర్ ని పొగిడాడంటే మిగతా బాలీవుడ్ కి కూడా నితిన్ 'లై' టీజర్ కనెక్ట్ అయినట్లే అంటున్నారు. మరి నితిన్ ఒక్క టీజర్ తోనే ఇటు టాలీవుడ్ ని అటు బాలీవుడ్ ని పడేసాడన్నమాట.

