ఇక పద్మావతి పద్మవత్...

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పద్మావతి సినిమా ఎట్టకేలకు సెన్సార్ కష్టాలు దాటింది. చిత్రం పేరుతో బాటు 26 కట్ లను సెన్సార్ సూచించడం దానికి చిత్ర యూనిట్ అంగీకరించడం జరిగిపోయాయి. సినిమా ఫిబ్రవరి 18 విడుదలకు ఇప్పుడు సన్నాహాలు ఊపందుకున్నాయి. చిత్రం టైటిల్ పద్మావతి నుంచి పద్మవత్ గా మార్చాలని సెన్సార్ బోర్డు సూచించింది. అది కూడా ఒకే అయిపొయింది. ఇన్ని జరిగాకా ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా లేక విడుదలకు సహకరిస్తారో తేలాలి.
పక్కదారి పట్టించిన పద్మావతి ...
సెలబ్రెటీల చుట్టూ ప్రధాన మీడియా పరిభ్రమిస్తున్న నేటి రోజుల్లో పద్మావతి సినిమా వివాదం దేశవ్యాప్తంగా అన్ని సమస్యలను పక్కదారి పట్టించింది. ఈ చిత్రంపై చర్చలు, థియేటర్లపై దాడులు, అంతా రచ్చ రచ్చే నడిచింది. ఏ ఛానెల్ చూసినా ఇదే ప్రధాన అంశంగా వ్యవహారం సాగింది. ఇందులో వున్నవారిని చంపేస్తామని వరకు కొందరు చేసిన అతి దేశవ్యాప్త చర్చకు తెరతీసేలా చేసింది. కోర్ట్ కొంత ఆలస్యంగా స్పందించినా భావ ప్రకటన స్వేచ్ఛ పై పైశాచిక దాడులు హెచ్చరికలపై సీరియస్ అయ్యింది. భావప్రకటనా స్వేచ్ఛ ను హరించవద్దని విదేశాల్లో సైతం సినిమాపై పౌరసంఘాలు ఉద్యమించాయి. ఇంత గోలకు కారణమైన ఈ సినిమా వివాదం గుజరాత్ ఎన్నికలు ముగిశాకా చిత్రంగా సైలెంట్ అయిపోవడం గమనార్హం. రాజకీయ క్రీడలో భాగంగానే పద్మావతిని ఉపయోగించారనే విమర్శలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.
- Tags
- పద్మావతి

