ఇంతకు మించి ఏం కావాలి

ఇవ్వాళ పొద్దున్నే మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో చేసారు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అంచనాలు రెట్టింపు అయ్యాయి.అయితే ఇప్పటి వరకు 'భరత్ అనే నేను' సినిమా సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ కానీ.. పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే ఈరోజు ఉదయం నుండి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసారు మేకర్స్.
ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్ ని రిలీజ్ చేసిన యూనిట్... అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ముఖ్యమంత్రి ఛాంబర్ కు బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ను పట్టుకుని నడిచి వస్తున్న మహేష్ లుక్ అదిరిపోయింది. బ్లూ కలర్ షర్ట్ తో..టక్ చేసి మహేష్ నడిచొస్తుంటే.. రెండు కళ్ల చాలడం లేదని చెప్పేయచ్చు.
ఈ పోస్టర్ ద్వారా 'భరత్ అనే నేను'టైటిల్ ను కంఫర్మ్ చేసారు. ఇలా ఒకే రోజు ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, మహేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఫస్ట్ ఓథ్ రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ యంగ్ సీఎంను ఎప్పుడెప్పుడు చూద్దాం అని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

