Wed Dec 24 2025 21:37:13 GMT+0000 (Coordinated Universal Time)
ఇంత సడన్ నిర్ణయమేంటి మేడమ్..

కమల్ హాసన్, గౌతమీ గత 13 ఏళ్లగా సహా జీవనం కొనసాగిస్తున్నారు. వీరి సహజీవనానికి ముందే కమల్ కి అదిఒరకే పెళ్లయింది. కానీ కమల్ మొదటి భార్య నుండి విడిపోయాడు. కమల్ కి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వారు శృతి హాసన్, అక్షర హాసన్ ఈ విషయం అందరికి తెలుసు. ఇక గౌతమి కూడా 1998 లో వ్యాపార వేత్త సందీప్ భాటియాను పెళ్లాడింది. పెళ్ళై ఒక కూతురిని కన్నాక గౌతమీ భర్త నుండి విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఇక కమల్ తో ఒక సినిమా లో చేసినప్పుడు వీరికి పరిచయం ఏర్పడింది. అయితే కమల్ మాత్రం గౌతమిని ఇష్టపడ్డాడు. ఇక గౌతమికి కూడా లోకనాయకుడిని ఇష్టపడి ఇద్దరూ సహజీవనం చెయ్యడం మొదలు పెట్టారు. ఈ 13 ఏళ్లగా ఇద్దరు నిజమైన భార్య భర్తల్లా అన్యోన్యం గా మెలిగారు. ఇక శృతికి, అక్షరకి కూడా వీరి బంధం పై అభ్యంతరం ఏమి లేదు. ఇక కమల్, గౌతమీ ఇద్దరూ కలిసే ఈ ఫంక్షన్ కైనా అటెండ్ అయ్యేవారు.
అయితే సడన్ గా గౌతమి తాను కమల్ హాసన్ తో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ కి గురి చేసింది. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహ జీవనానికి ఇక శుభం కార్డు వేయనున్నట్లు గౌతమి ఇంతకు ముందే ప్రకటించింది. ఇక ఇద్దరూ కలిసి ఉండమని ఆవిడ ప్రకటించింది. ఇన్నేళ్లుగా కమల్ తనకి పూర్తి సహాయ సహకారాలందించాడని... తనకి కేన్సర్ సోకిన సమయం లో వెన్ను దన్నుగా నిలబడ్డాడని చెప్పింది. ఇక కమల్ అంటే తనకి చాలా ఇష్టమని ఇలా విడిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆవిడ తెలిపారు. కమల్ తన జీవితం లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాక్షించారు.
అయితే తాము ఎందుకు విడిపోతున్నామో మాత్రం గౌతమి బయట పెట్టలేదు. అసలు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. కానీ వీరు విడిపోవడానికి కారణం మాత్రం శృతి హాసన్ అని అంటున్నారు. ఈ మధ్యన శభాష్ నాయుడు సినిమా లో కాస్ట్యూమ్స్ విషయం లో గౌతమి, శృతి హాసన్ గొడవ పడ్డారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. మరి ఇదే కారణమా.... లేక ఇంకేదైనా ఉందా.... అనేది తెలియాల్సి వుంది. అయితే తాను కమల్ నుండి విడిపోవడాన్ని ఆమె ఒక లేఖ ద్వారా మీడియా కి తెలియజేసారు. అయితే గౌతమి ఈ మధ్యన మళ్ళీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. తెలుగులో వచ్చిన మనమంతా సినిమాలో నటించారు. ఇంకా ఆమె కొన్ని సినిమాల్లో నటించడానికి ఒప్పుకుందని సమాచారం.
Next Story

