Mon Dec 29 2025 17:18:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆలోటును రాజమౌళి ఎలా భర్తీ చేసుకుంటారో?

అపజయం ఎరగని చిత్రాలు చేస్తూ 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళికి త్వరలో అగ్పిపరీక్ష ఎదురవ్వనుంది. 'బాహుబలి - ది కన్‌క్లూజన్' చిత్రం తర్వాత ఇప్పటివరకు రాజమౌళి సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు కీరవాణి వచ్చే ఏడాదే పరిశ్రమకు గుడ్‌బై చెబుతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి చిత్రాలకు ఎవరు బెస్ట్ చాయిస్ అనే విషయం టాలీవుడ్‌లలో చర్చనీయాశంగా మారింది.ఇక 'సై' చిత్రం నుండి రాజమౌళికి బెస్ట్ చాయిస్‌గా చెప్పుకునే సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ కూడా ప్రస్తుతం కీలకనిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 'బాహుబలి2' తర్వాత సెంధిల్కుమర్ డైరెక్టర్‌గా మారనున్నాడు. దాంతో తన కుడి, ఎడమ భుజాలైన ఇద్దరు రాజమౌళికి బై చెబితే మరి ఆ స్దానాలను రాజమౌళి ఎలా? ఎవరితో? రీప్లేస్ చేస్తున్నాడు అనే విషయంపై ఆయన సన్నిహితులు వేర్వేరుగా స్పందిస్తున్నారు.
ఇప్పటికే తన కెరీర్ ని విజయపధంలో దూసుకుపోతున్న రాజమౌళి కి వీరిద్దరి లోటు వచ్చే సినిమాలు తెరకెక్కించినప్పుడు బాగా తెలుస్తుంది. తన విజయాలను తన టీమ్ తోనే సాధిస్తున్న రాజమౌళి ఇలా తన టీమ్ లో హేమ హేమాలిద్దరు వెళ్లిపోతుంటే ఏం చేస్తాడు మరి. ఏముంది దర్శకధీరుడు మరో ఇద్దరి హేమ హేమలను తయారు చేసుకుంటాడు. అంతే గాని సినిమాలు తియ్యడమైతే మానదు కదా అంటున్నారు సన్నిహితులు.
Next Story

