Tue Dec 30 2025 01:22:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన ట్వీట్లు జనానికి చిరాకు పుట్టిస్తున్నాయ్

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వర్మ గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ ట్విట్టర్ లో నేనున్నానంటూ గుర్తు చేస్తూనే ఉంటాడు. ఎందుకో ఏమో ఒక పక్క సినిమాలు తీస్తూనే ఉంటాడు మరో పక్క ట్విట్టర్ ని హ్యాండిల్ చేస్తూనే వున్నాడు. తన సినిమాలకు పబ్లిసిటీ కావాలనుకుంటాడో లేక తన పేరు దేశ వ్యాప్తం గా మార్మోగిపోవాలనుకుంటాడో.... అందుకే ఎప్పుడూ ఎదో ఒక విషయమై ట్విట్టర్ ని వాడుకుంటూ కాలం గడిపేస్తున్నాడు ఈ పెద్దమనిషి వర్మ. ఒక విధం గా వర్మ అంటే ఎవ్వరికి పెద్దగా నచ్చదు. ఎందుకంటే అతనేం మాట్లాడతాడో అతనికే కొన్ని కొన్ని సార్లు తెలియదు. కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టి మాట్లాడినా మరికొన్ని సార్లు అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. మరి ఆయన తీసే సినిమాలలో క్వాలిటీ లేనట్లే ఆయన రాసే ట్విట్టర్ రాతలు కూడా అంతే ఉంటున్నాయి.
అయితే ఈమధ్యన వర్మ పవన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఎప్పుడుబడితే అప్పుడు పవన్ ని పొగిడే పని పెట్టుకుని ట్విట్టర్ సాక్షిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అంటే పవన్ ని గనక అందలమెక్కిస్తే వర్మకి ఏం వరుగుతుందో తెలియదు గాని ఆయన్ని మాత్రం ములగ చెట్టు ఎక్కించే కాంట్రాక్టు తీసుకుని ఇలా ట్విట్టర్లో రాస్తున్నాడు. ఇంతకు ముందు పవన్ ఒక కమాండర్ అని అతని వెనక అందరూ సైన్యం లా నిలబడితే ప్రత్యేక హోదా సాధించడం ఖాయమని పొగిడిన వర్మ..... తాజాగా అందరకి 'కాపు' కాసే నాయకుడు అవుతాడని..... 'కమ్మ'గా కాసేపు మాట్లాడుకునే నాయకుడని ఇష్టం వచ్చినట్లు ట్వీట్స్ చేసేసాడు. కమ్మ, కాపు అని పదాలు ఉపయోగించి.... మళ్ళీ కమ్మ అంటే కమ్మనైన స్వీట్స్ అంతేగాని కులాలకు సంబంధించి కాదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఆలా అర్ధం పర్ధం లేకుండా పేలడం ఎందుకు ఇలా వివరణ ఇవ్వడం ఎందుకు. మరి అసలు రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్స్ తో కాలం గడిపేస్తూ ఎందుకు అందరి నోళ్ళలో నానుతున్నాడో గాని కొంతమందికైతే చిరాకు పుడుతుంది ఈయన ట్వీట్స్ చూస్తుంటే.
Next Story

