ఆనవాలు పోల్చుకోలేని విధంగా దర్శనమిచ్చిన హీరోయిన్

చిత్ర పరిశ్రమలో కథానాయిక గా వెలుగొందటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందం వున్నవారికి అభినయం ఉండదు. అభినయం వున్నవారికి అందం ఉండకపోవచ్చు. ఆ రెండు వున్న వారికి అదృష్టం కలిసి రాకపోవచ్చు. అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆకర్షించే విధంగా కనపడటానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వుంటారు కథానాయికలు. కానీ పూర్వ ఛాయలు ఏమి కానరాని విధంగా దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది కథానాయిక పాయల్ ఘోష్. ప్రయాణం చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయాణం మొదలు పెట్టిన పాయల్ ఘోష్ కి ప్రయాణం సుఖమయం కాలేదు.
కథానాయికగా నటించిన తొలి చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేక ఫెయిల్యూర్ గా నిలవటంతో తదుపరి కాలంలో కథానాయిక పాత్రలు దొరకక ఊసరవెల్లి చిత్రంలో హీరోయిన్ తమన్నా స్నేహితురాలి పాత్రలో కూడా కనిపించింది. ఆ చిత్రం కూడా పాయల్ ఘోష్ అవకాశాలు మెరుగు పరచలేకపోయింది. ఊసరవెల్లి విడుదల ఐన ఏడాదే మిస్టర్ రాస్కేల్ అనే చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం ఎప్పుడు విడుదలైయ్యింది కూడా సగటు ప్రేక్షకుడి దృష్టిలో పడలేదు. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అమ్మడు దర్శనమివ్వగా చూసి గుర్తిపట్టిన నాథుడే లేడు. ఆ విధంగా పాయల్ ఘోష్ శరీరంలో మార్పులు వచ్చేసాయి. ముఖంలోనూ పూర్వ ఛాయా, చార్మ్ రెండు లేకపోవటం గమనార్హం. ఇక ఈ లుక్ తో అయితే అవకాశాలు కోసం ప్రయత్నాలు చెయ్యటం కూడా దండగే నేమో..

