ఆదాయం కొల్లగొట్టిన అదుపు లేని నాలుక!

నోటిమీద అదుపులేకపోతే.. జరిగే నష్టం ఒక్కొక్కరికి ఒక్కోతీరుగా ఉంటుంది. ఆ నష్టం చెప్పనలవి కానిది. కొందరికి మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కొందరికి ప్రాణం మీదకు వస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మాత్రం.. తన అదనపు సంపాదన మీదికి వచ్చింది. ఇంచుమించుగా తన నోటి దూకుడు కారణంగానే ఆయన ఇప్పుడు కొన్ని బ్రాండ్ అంబాసిడర్ పదవులను కోల్పోవాల్సి వస్తోంది.
బాలీవుడ్ లో కొంచెం నోరు జారి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ మధ్యన అమీర్ ఖాన్ ని చూసిన వాళ్లకి అర్ధమయ్యే ఉంటుంది. ఈ దేశం లో జీవించాలంటే కొంచెం భయమేస్తుందని అన్న అమీర్ ఖాన్ భార్య మాటలకి అమీర్ ఖాన్ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న యాడ్స్ అన్నీ అతని చేతులనుండి చేజారిపోవడమే కాకుండా అందరి చేత నానా మాటలు పడాల్సి వచ్చింది. అతనెంత తప్పని మొత్తుకున్నా కూడా అమీర్ కి వచ్చిన అవకాశాలు... ప్రభుత్వ రంగ యాడ్స్ అన్ని అమీర్ చేతుల్లోనుండి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు సల్మాన్ కి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఈ మధ్యన పాక్ దాడుల సందర్భం గా పాకిస్తాన్ కళాకారులని నిషేదించాలని ప్రభుత్వం దగ్గర నుండి దేశ ప్రజల వరకు నినదిస్తుంటే సల్మాన్ మాత్రం పాకిస్తాన్ దాడులు చేస్తే అక్కడ నుండి వచ్చిన నటులు, కళాకారులూ ఏం చేశారు... వారిని నిషేధించడం కరెక్ట్ కాదని సంచల వ్యాఖ్యలు చేసాడు.
ఈ వ్యాఖ్యలని ప్రజల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ తప్పుబట్టి సల్మాన్ పై దుమ్మెత్తి పోశారు. కానీ సల్మాన్ మాత్రం తప్పని ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు కొన్ని యాడ్ కంపెనీలు కూడాసల్మాన్ కి బై బై చెప్పడానికి రెడీ అయ్యాయి. వాటిలో కోకాకోలా ముందుగా సల్మాన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించి మరో హీరోని ఆ స్థానం లోకి తీసుకోవడానికి రెడీ అయ్యింది. సాఫ్ట్‌డ్రింక్ థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సల్మాన్ కాంట్రాక్టు గత నెలలోనే ముగియడం తో ఈసారి మరో హీరోకి ఆ ఛాన్స్ ఇవ్వడానికి కోకాకోలా రెడీ అయ్యింది. ఇక సల్మాన్ ని కొనసాగించడానికి ఇష్టపడక ఆ స్థానం లోకి రణవీర్ సింగ్ ని తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ దాని ప్రచారం కోసం ఒకో ఏడాదికి 5 కోట్ల వరకు తీసుకున్నాడని సమాచారం. కేవలం ఈ యాడ్ ప్రచారం సల్మాన్ చేతుల నుండి చేజారిపోవడానికి అతని నోటి దూకుడే కారణమంటున్నారు.

