ఆటో జానీగా చరణ్!

దృవ సినిమా నుండి కొత్త కథలు ట్రై చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన అభిమానులకు నచ్చే విధంగా సినిమా సినిమాకు వెరియేషన్ చూపిస్తున్నాడు. ఆలా అని కమర్షియల్ ఫార్మాట్ ని మరువడం లేదు. ప్రస్తుతం రంగస్థలం సినిమా కూడా ఏ తరహాలో తెరకెక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక అసలు విషయానికి వస్తే..రంగస్థలం సినిమా తర్వాత చెర్రీ, బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటదని చిత్ర యూనిట్ చెబుతుంది. ముఖ్యంగా చరణ్ రెండు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తాడు అని చెబుతున్నాడు. ఈ సినిమా.. 70 % షూటింగ్ రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో జరుగుతుందంట. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..1991 లో మెగాస్టార్ నటించిన రౌడి అల్లుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో మెగాస్టార్ మాస్ లుక్ లో ఆటో జానీగా అలాగే క్లాస్ లుక్ లో కళ్యాణ్ గా డ్యూయల్ రోల్ చేసి చాలా ఆకట్టుకున్నాడు.
అదే విధంగా చరణ్ కూడా డబుల్ యాక్షన్ లో అలరిస్తాడట. బాలివుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ రతన్ ధన్ పాయో ఆనవాళ్లు కూడా అందులో ఉంటాయట. అయితే ఇప్పుడు తన తండ్రి సినిమాను అలాగే బాలీవుడ్ హిట్ సినిమాను చెర్రీ ఫాలో అవుతున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో వేచి చూడాలి.

