ఆ హీరోయిన్ ని బెదిరించారా?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో చిన్నారి గా కనబడిన అవికా గోర్ చాలా తక్కువ వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. హిందీలో ఒక సీరియల్ లో నటిస్తూనే తెలుగులో హీరోయిన్ గా చక్రం తిప్పడానికి రెడీ అయ్యింది. వచ్చిన వెంటనే రెండు మూడు వరుస హిట్స్ తో అవికా, హీరోయిన్ గా నిలదొక్కుని నిలబడింది అనుకున్న టైం లో అవికా గోర్ అస్సలు మీడియాకి కనబడకుండా బాలీవుడ్ కి వెళ్లిపోయిందని అన్నారు. అయితే అక్కడ కూడా ఎటువంటి సీరియల్ లో గాని ఎటువంటి సినిమాల్లో గాని కనబడడం లేదు.
అయితే అవికా అలా మాయం కావడానికి ఓ యంగ్ హీరో నుండి వేధింపులు రావడం వలెనే అని ప్రచారం జరిగింది అప్పట్లో. అయితే తాజాగా అవికా గోర్ ఇండస్ట్రీలోకి వచ్చి రావడంతోనే హిట్స్ తో దూసుకుపోతూ...... డిమాండ్ పెరగడం వంటి వాటితో తమకి అవకాశాలు లేకుండా చేస్తుందన్న కసితోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక సెలెబ్రిటీ కావాలనే అవికాకి ఆఫర్లు రాకుండా అడ్డుపడడం వల్లనే అవికాకు అవకాశాలు తగ్గిపోయాయని... ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోన్న లేటెస్ట్ న్యూస్. అందుకే అవికా టాలీవుడ్‌ని వదిలేసిందని కూడా చెప్పుకుంటున్నారు.
ఇక అవికా నోటి దగ్గర కూడు లాగేసిన ఆ సెలెబ్రిటీ ఎవరై ఉంటారబ్బా అని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఇండస్ట్రీలో ఏదో ఒకటి జరగకపోతే అవికా అలా ఉన్నట్టుండి మాయం కాదనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు కొందరు

