ఆ హీరోగారు సూపరంట!!

బాలకృష్ణ - పూరి కాంబోలో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా మెప్పించనున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రంలో బాలకృష్ణ కి సంబందించిన కొన్ని లుక్స్ ఇప్పుడు మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ముందు విడుదల చేసిన 'పైసా వసూల్' ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ లుక్ ఎవరికీ ఎక్కలేదు. దాంతో నందమూరి అభిమానులు బాగా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు బయటికి వచ్చిన లుక్స్ లో మాత్రం బాలయ్య బాబు అదుర్స్ అంటూ తెగ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు ఫాన్స్.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటిస్తున్నారు. అయితే ముగ్గురిలో ఒకరైన కైరా దత్, బాలకృష్ణతో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లిందట. ఈ విషయాన్ని కైరా స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి బాలకృష్ణ తో డేట్ కి వెళ్లిన కైరా, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించింది. బాలకృష్ణగారు నిజంగా జెంటిల్మెన్ అని..... బాలయ్య మనసు చాలా మంచిదని..... ఆయన అందరిమీద ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపిస్తారని.... పొగిడేస్తోంది. అలాగే బాలకృష్ణతో డేట్ కి వెళ్లడం చాలా బాగుందని కూడా అంటుంది.
ఇక వారిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోని కూడా షేర్ చేసింది కైరా. మరి బాలకృష్ణను ఇప్పుడు పొగిడేస్తున్న ఈ భామ ఇంతకుముందు కూడా బాలకృష్ణ గ్రేట్ అంటూ పొగిడింది. 'పైసా వసూల్' క్లైమాక్స్ షాట్ లో బాలయ్య చేసిన రిస్కీ షాట్స్ కి ఆశ్చర్యపోయి షాకయ్యానంటూ అప్పుడు కూడా బాలక్రిష్ణని ఆకాశానికెత్తేసింది. ఇక పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న 'పైసా వసూల్' షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇక ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు

