ఆ హీరో వల్లే పెండింగ్ లో పడిందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్ - మహేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ సినిమా కూడా ఫైనలైజ్ అయింది. అయితే ఇప్పుడు ఇంకో మల్టీస్టారర్ ఉందని టాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
నందమూరి బాలకృష్ణ- మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఉందని దీనికి 14 రీల్స్ నిర్మాణం చేబడుతుందని వినికిడి. బోయపాటి డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతుంది. వరస ఫ్లోప్స్ లో వున్న మహేష్ ఓ మాంచి మసాలా మూవీ చేయాలని భావిస్తున్నాడు.ఇందుకు బోయపాటి శ్రీను సరైన డైరెక్టర్ అని భావించి.. పలు మార్లు డిస్కషన్స్ కూడా చేశాడు. బోయపాటి చెప్పిన స్టోరీ కి మహేష్ ఇంప్రెస్స్ కూడా అయ్యాడట. టాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతానని చెప్పాడట బోయపాటి. మహేష్ తో కలిసి మల్టీ స్టారర్ చేసేందుకు.. ఇప్పటికే బాలయ్య ఓకే కూడా చెప్పేశారని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కడానికి అసలు సమస్య అల్లా మహేష్ అంట. ప్రస్తుతం భరత్ అను నేను చిత్రం చేస్తున్న మహేష్.. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చెయ్యడమే కాకూండా... ఆ సినిమా ఫలితాన్ని చూసాకే... బోయపాటి చెప్పిన ఈ సబ్జెక్టు ఓకె చేయాలనీ చెప్పేశాడట మహేష్. అందుకే ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడిపోయిందని తెలుస్తోంది.

