ఆ హీరో తో చేయనంటున్న నిత్య

శర్వానంద్ - నిత్యా మీనన్ తో కలిసి 'మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు ,రాజాధిరాజ వంటి సినిమాలలో నటించి పరిశ్రమ లో మంచి జంట గా గుర్తింపు పొందారు. వీరికలయికలో అంటే శర్వానంద్ తో నిత్యా మీనన్ మరో సినిమా కి ఓకే చెప్పింది. ప్రస్తుతం శర్వానంద్ దర్శకుడు సుదీర్ వర్మ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సీనియా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవానికి రెడీగాఉంది. అయితే శర్వానంద్ - సుధీర వర్మ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారని.. సినిమా మొదలైన రోజే ఆ హీరోయిన్స్ పేర్లను అధికారికంగా ప్రకటించారు.
శర్వానంద్ కి జంటగా కాజల్ అగర్వాల్ మరొకరుగా నిత్యామీనన్ నటిస్తుండడం తెలిసిందే. అయితే ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్ళబోతున్న సమయం లో ఒక హీరోయిన్ నిత్యా మీనన్ ఈ చిత్రం నుండి తప్పుకోవడం చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. అయితే ఎందుకు నిత్య మీనన్ ఆ సినిమా నుండి తప్పుకుందా అనేది తెలియాదు గాని.. నాని నిర్మాత గా ఆవ్ అనే చిత్రంలో నటిస్తుంది నిత్యా మీనన్. కారణం నాని సినిమా అని చెప్పలేం. ఎందుకంటే నాని సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇకపొతే శర్వానంద్ సుదీర్ వర్మ కలయిక తో వస్తున్న చిత్రం సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రశాంత్ పిళ్ళై ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

