ఆ సినిమా 200 కోట్లు కొల్లగొట్టింది

బాలీవుడ్ లో చాలా కాలం నుండి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ఈ మధ్యన భారీ విజయాలు అందుకోవడంలో టాప్ స్టార్స్ సినిమాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. సల్మాన్ ఎంతో ప్రెస్టీజియస్ గా నటించిన 'ట్యూబ్ లైట్' సినిమాతో పాటే చాలా సినిమాలు సోదిలోకి లేకుండా పోయాయి. అసలు బాలీవుడ్ లో 'బాహుబలి' తర్వాత అంతటి స్థాయి హిట్ మరే సినిమా అందుకోలేకపోయింది. మరి 'బాహుబలి' సినిమా బాలీవుడ్ బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది. బాహుబలి దెబ్బకి మైండ్ బ్లాంక్ అయిన బాలీవుడ్ టాప్ హీరోస్ అంటా హా... 'బాహుబలి' ఎంత మా సినిమా ముందు అని బిల్డప్ ఇచ్చి బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డారు.
అయితే కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే తన ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’ సినిమాలతో పర్వాలేదనిపించారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బాక్సాఫీసు కలెక్షన్స్ దుమ్మురేపుతున్న సినిమా 'జుడ్వా 2 '. వరుణ్ ధవాన్ హీరోగా... వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాక్వలిన్, తాప్సి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పుడు 200 కోట్లు కొల్లగొట్టి అదరహో అనిపిస్తుంది. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన 'జుడ్వా 2 ' బాలీవుడ్ లో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. వరుణ్ ధవాన్ వంటి మీడియం రేంజ్ హీరోతో తెరకెక్కిన ఈసినిమా ఇప్పుడు 200 కోట్ల కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తుంది.
సెప్టెంబర్ 29 న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులుకు నచ్చడంతో... ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. విడుదలైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

