ఆ బూతును భరించలేక ఆగ్రహిస్తున్న నెటిజన్లు

అడల్ట్ కామెడీ అనేది ఓ యాక్సెప్టబుల్ ఫిలిం జోనర్ గా తీసుకువచ్చేసి.. ఆ ముసుగులో అచ్చోసిన బూతు చిత్రాలను స్ట్రెయిట్ గా వెండితెర మీదకు సంధించేయడం బాలీవుడ్ కు బాగా అలవాటైపోయింది. ఇదివరకటి రోజుల్లో అయితే.. రహస్యంగా నలుగురు కుర్రాళ్లు కలసి దొంగతనంగా సీడీలు తెచ్చుకుని, ఆ తర్వాత కంప్యూటర్ ఇంటర్ నెట్ తెరల మీద చూస్తూ వచ్చిన బూతు చిత్రాలు ఇప్పుడు రైట్ రాయల్ గా 70 ఎంఎం థియేటర్లలోకే వచ్చేస్తున్నాయి. యష్ చోప్రా కుమారుడు బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఆదిత్య చోప్రా.. తన తాజా చిత్రాన్ని ఈ అడల్ట్ కామెడీ ముసుగులో సెమీ బూతు చిత్రంలాగా రూపొందించేయడంపై నెటిజన్లలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ చిత్రం ట్రైలర్ చూపిస్తున్న శృంగారమే నెటిజన్లకు వెగటు పుట్టించేస్తోందంటే అతిశయోక్తి కాదు.
‘‘యష్ చోప్రా బతికుండుంటే నాలుగు దేబ్బలేసి కొడుకుని కంట్రోల్ లో పెట్టేవాడు. పెద్దాయన పోయేసరికి వీడికి అడ్డు అదుపు లేకుండా పోయింది.’’ లాంటి కామెంట్లతో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.
అడల్ట్ కామెడీ పేరుతో సెమీ పోర్న్ చిత్రాలను వండి వార్చేసి.. స్కిన్ షో అనేదే మార్కెటింగ్ ఎలిమెంట్‌గా భావిస్తూ నాలుగు కాసులు సంపాదించుకునే సినిమాలు బాలీవుడ్లో లెక్కకు మిక్కిలిగానే వస్తున్నాయి. కాకపోతే.. యష్ చోప్రా వంటి పెద్దాయన కొడుకు ఇలా పెడదారి పడుతుండేసరికి నెటిజన్లకు కోపం వచ్చినట్లంది.

