అస్సలు రెస్ట్ లేకుండా?

పూరి జగన్నాధ్ బాలకృష్ణతో తీసిన పైసా వసూల్ చిత్రం తేడా కొట్టినప్పటికీ... ఏమాత్రం లేట్ చెయ్యకుండా తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో బాగా బిజీగా వున్నాడు. తన కొడుకుని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ 'మెహబూబా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని చాలా స్పీడు గా కానిచ్చేస్తున్నారు పూరి. మొన్నటివరకు గడ్డకట్టే చలిలో హిమాచల్ ప్రదేశ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 'మెహబూబా' సినిమా అక్కడే ప్రారంభమై... అక్కడే మొదటి షెడ్యూల్ లో భాగంగా చాలా సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది.
ఇక ఇప్పుడు 'మెహబూబా' యూనిట్ మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేసి.. అక్కడినుండి పంజాబ్ కు బయలుదేరింది. మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న చిత్ర బృందం కూసింత రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే పంజాబ్ లో వాలిపోయింది. పంజాబ్, పాకిస్థాన్ బోర్డర్ లో 'మెహబూబా' సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. 1971 ఇండోపాక్ యుద్ధం నేపథ్యంలో మెహబూబా సినిమా పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ పై పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు

