అవునా..... నిజమా...!!

రానా హీరోగా కాజల్ అగర్వాల్, కెథెరిన్ లు హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ మధ్యన విడుదలై సంచలనం సృష్టించింది. ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఈ చిత్రంలో రానా జోగేంద్రగా ఇరగదీస్తున్నాడు. అలాగే కాజల్ అగర్వాల్ చాలా పద్దతిగల అమ్మాయిలా చీరకట్టు పెద్ద జడతో ఆకట్టుకుంటుంది. ఇక మరో హీరోయిన్ కేథరిన్ మోడ్రెన్ అమ్మాయిలా అదరగొడుతుంది.
అయితే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చాలా ట్రెడిషనల్‌గా కనిపిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. ఈ చిత్రంలో కాజల్ చాలా నిండుగా నగలు ధరించి ఒక దేవతలా కనబడుతుంది. అయితే కాజల్ ధరించిన ఆ నగలు అన్ని ప్యూర్ గోల్డ్ అట. కాజల్ వేసుకున్న నగలని ఒక జ్యువలరీ సంస్థ తేజ సినిమా కోసం స్పాన్సర్ చేసిందని చెబుతున్నారు. అయితే జ్యువలరీ సంస్థ తన నగల పర్యవేక్షణ కోసం తమ షాప్ లోని కొంతమందిని సినిమా షూటింగ్ జరిగేచోట నియమించిందట. ఇక అక్కడ వారి పని ఆ నగలు షూటింగ్ ఉన్నప్పుడు కాజల్ కి పెట్టి మరలా షూటింగ్ అవ్వగానే అవి తీసి జాగ్రత్త చెయ్యడమేనట. అలాగే షూటింగ్ స్పాట్ లో గట్టి బందోబస్తుని కూడా పెట్టారట. మరి ఒరిజినల్ నగలు కదా అందుకే ఇంత జాగ్రత్త. ఇక షూటింగ్ కంప్లీట్ కాగానే ఆ జ్యువలరీ సంస్థ తమ నగలను తీసుకుని షోరూం లో పెట్టేసుకుంటుందట.
అయితే అలా జ్యువలరీ సంస్థ నగలను స్పాన్సర్ చెయ్యడానికి ఒక కారణం కూడా ఉందట. కాజల్ వారి జ్యువలరీ సంస్థకి ప్రచార కర్తగా పనిచెయ్యడం ఒక కారణమైతే.... సినిమాలోని నగల డిజైన్స్ చూసి తమ షాప్ కి కష్టమర్స్ పెరుగుతారు కదా. ఇంకా ఈ సంస్థ 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం ప్రచారం కోసం చాలా డబ్బుని కూడా ఖర్చుపెడుతుందట.


