అవికా... సడన్ గా ఏంటిది?

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ ఎంత చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అందుకుందో అంతే తక్కువ టైం లో తెరమరుగైపోయింది. వరుస హిట్స్ అందుకున్న అవికా గోర్ కారణాలు క్లారిటీ లేదుగాని సినిమాల్లో కనిపించడం పూర్తిగా మానేసింది. అయితే అవికా గోర్ ని ఎవరో స్టార్ హీరోయిన్ బెదిరించింది.. అలాగే హిందీ సీరియల్ లో నటించే హీరోని అవికా పెళ్లాడడం వల్లనే సినిమాలకు దూరమైందని .. కాదు కాదు సినిమాల కన్నా హిందీ సీరియల్స్ కంఫర్ట్ కాబట్టే ఒక హిందీ సీరియల్ కి కమిట్ అయ్యి సినిమాలు వదిలేసిందని అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు తెలుగమ్మాయి కన్నా ఎక్కువగా దగ్గరయిన అవికా గోర్ క్యూట్ లుక్ తో కాస్త బొద్దుగానే ఉండేది. తాను నటించిన సినిమాల్లో ఎక్కడా గ్లామర్ జోలికి పోకుండా ట్రెడిషనల్ పాత్రల్లోనే అదరగొట్టింది. కానీ ఎందుకో సడన్ గా సినిమాల నుండి మాయమైపోయింది. ఆమెకి నిజంగానే ఆఫర్స్ రాకా? లేదా ఏదైనా నిజంగానే జరిగిందా అనేది మాత్రం ఎవ్వరికి అంతుబట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక సినిమాలను వదిలేసినా ఎటువంటి ఫోటో షూట్స్ తో హడావిడి చెయ్యని అవికా గోర్ ఇప్పుడు తాజాగా ఒక ఫోటో షూట్ లో మాత్రం అందరిని షాక్ లో పడేసింది.
అవికా గోర్ తాజాఫొటో షూట్ లో ఎప్పుడు లేని గ్లామర్ తో అదరగొట్టేసింది. కేవలం డ్రెస్ మాత్రం గ్లామర్ గా లేదు.... క్లివెజ్ షో తో మత్తెక్కిస్తూ అందరిని సంబ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. డ్రెస్ కాస్ట్యూమ్ కూడా అదరగొట్టింది. ఇక అవికా గోర్ స్మైల్ కూడా చాలా ఆకట్టుకుంటోంది. స్మైల్ తోనే హార్ట్ ని టచ్ చేస్తోంది అని కుర్రకారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఉన్నట్టుండి అవికా ఇలాంటి ఫోటో ని ఎందుకు పోస్ట్ చేసింది. అంటే అవికా హీరోయిన్ గా ఇంకా ట్రై చేస్తూనే ఉంది అనేగా దీనర్ధం.

