అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినికి అస్వస్థత

అర్జున్ రెడ్డి సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించిన హీరోయిన్ షాలిని పాండే కి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఒక్క సినిమా విజయంతో షాలిని పాండే కి వరుసగా ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అంతే కాకూండా షాలిని పాండే ని షాప్ ఓపెనింగ్స్ కి బాగానే ఇన్వైట్ చేస్తున్నారు. అందులో భాగంగానే షాలిని ఈ రోజు బుధవారం నెల్లూరులో సెల్ పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు షాలిని చిన్న వీడియో బైట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను నెల్లూరులో సెల్ పాయింట్‌ను ప్రారంభించడానికి వెళుతున్నట్లు ఆ వీడియోలో చెప్పింది.
అయితే అక్కడ సెల్ పాయింట్‌ను ప్రారంభోత్సవం జరిగేటప్పుడు షాలిని కళ్ళు తిరిగి కిందపడిపోయింది. ఎండా తీవ్రత ఎక్కువగా ఉండడంతో షాలిని సొమ్మసిల్లిపడిపోయి తీవ్ర అస్వస్థత కు గురైంది. ఇక వెంటనే షాలిని పాండే ని దగ్గరలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తర్వాత ఆమెని స్ట్రైచర్‌పై తీసుకెళ్లి కారులో ఎక్కించి పంపించారు ఆసుపత్రి సిబ్బంది. అయితే ఆమెను స్ట్రైచర్‌పై ఉంచి కారు ఎక్కించేటప్పుడు షాలిని మొహం కనబడకుండా తెల్లని క్లాత్ కప్పి ఉంచారు. మరి హీరోయిన్ షాలిని ఆసుపత్రిలో చేరింది అనగానే అక్కడ ఉన్న పేషేంట్స్, ఆసుపత్రి సిబ్బంది కూడా షాలిని తో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడబట్టే ఆసుపత్రి సిబ్బంది అలా షాలిని మొహం పై క్లాత్ కప్పి ఉంచినట్లు తెలుస్తుంది.

