అయ్యో సితార మిస్ అయ్యిందే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' సినిమా విడుదల తర్వాత జాలీ ట్రిప్ కి ఫ్యామిలీతో పాటు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశీ ట్రిప్ ముగించుకుని వచ్చిన మహేష్ బాబు తాజాగా తన అక్క మంజుల కూతురు ఓణీల ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు. తన భార్య నమ్రత, కొడుకు గౌతమ్ తో ఈ వేడుకకి హాజరయ్యాడు మహేష్. అయితే ఎప్పుడూ ఎటువంటి వేడుకలకి మిస్ అవని మహేష్ కూతురు సితార మాత్రం ఈ వేడుకలో కనబడలేదు. మరి ఎందుచేతనో ఈ వేడుకకి... సితార రాలేదో గాని... మహేష్ అభిమానులు మాత్రం సితారని మిస్ అయ్యమే అనే ఫీల్ లో ఉన్నారు. మహేష్ పెళ్ళికి వెళ్లినా... ఏ ఫంక్షన్ కి వెళ్లిన కూడా తన ఫ్యామిలీ నమ్రత, గౌతమ్, సితారాలతో కలిపి వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ఇక సితార కూడా ఆ ఫంక్షన్ లో ఆడిపాడి అల్లరి చేస్తుంది. కానీ ఈ వేడుకలో సితార మాత్రం మిస్ అయ్యిందనే చెప్పాలి.
ఇకపోతే కృష్ణ కూతురు మంజుల తన కూతురు ఓణీల ఫంక్షన్ ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకలో కృష్ణ తన మనవరాలికి బట్టలు పెట్టి ఆశీర్వదించగా... మహేష్, నమ్రతలు మామ అత్తల స్థానంలో మంజుల కూతురుని ఆశీర్వదించారు. మేనమామ హోదాలో మహేష్ ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు. ఇప్పుడు మంజుల కూతురు ఓణీల ఫంక్షన్ ఫోటోలు సోషల్ ఇండియాలో హల్చల్ చేస్తున్నాయి.

