అయ్యో పాపం ప్రకాష్ రాజ్!

‘నన్ను మించిన మహానటుడు మరొకరు లేరు’ అనే మాట పత్రికల ఇంటర్వ్యూలో చెప్పాలంటే సదరు నటుడికి చాలా దమ్ముండాలి. ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే.. ఆయన ఒక రకంగా అంత దమ్మూ ఉన్న నటుడే. కాకపోతే.. తను చేసే సినిమాల విషయంలో , షూటింగులకు హాజరయ్యే విషయంలో ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఏడిపిస్తాడనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అలాంటి ప్రకాష్ రాజ్ కు దర్శకత్వం అంటే మహో మోజు. దర్శకత్వం చేయాలని ఉన్నప్పుడు.. ఎంత గొప్ప సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదిలేస్తా అనేది ఆయన తాజాగా చెబుతున్నమాట. దర్శకత్వం మీద అంత ప్యాషన్ ఉన్న నటుడు.. మెగాఫోన్ పట్టుకున్నప్పుడు .. ఎంతో కొంత ఘనంగానే సినిమా తీసి ఉంటాడని అంతా అనుకుంటారు. తీరా తీసింది గొప్ప క్రియేటివిటీ తో ముడిపడిన వ్యవహారం కూడా కాదు. మళయాళంలో విడుదల అయి విజయవంతం అయిన చిత్రమే.
కాకపోతే తెలుగు ప్రేక్షకుల ఎదుటకు తెచ్చేసరికి బాక్సాఫీసు వద్ద పడుకుంది. నిజానికి ప్రకాష్ రేంజికి తాను దర్శకత్వం మాత్రం చేస్తానని అనుకున్నాస రే.. నిర్మాతలు పలువురు ముందుకు వచ్చే పరిస్తితే. కానీ.. టైం బ్యాడ్ అయినప్పుడు మనమే ప్రొడ్యూస్ చేద్దాం అని ఎవరికైనా అనిపిస్తుంటుంది. ప్రకాష్ రాజ్ కూడా తన సొంత బ్యానర్ మీద ఈ ’మనఊరి రామాయణం’ తెరకెక్కించాడు. తీరా అది బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. నా సినిమా కు చాలా పాజిటివ్ టాక్ ఉంది.. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి చూడండి.. అంటూ ఫేస్ బుక్ పోస్టు కూడా పెట్టుకున్నాడు. అయితే అక్కడ కూడా జనం ‘ఇలా అడుక్కోవడం మానేయండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారట.
పాపం.. అసలే సొంత డబ్బు పెట్టి మెగాఫోన్ ముచ్చట తీర్చుకోవడానికి సినిమా చేస్తే.. ఈ స్థాయిలో చేతులు కాలడంతో పాటు, ఇలాంటి తిట్లు దీవెనలూ కూడా ఎదురవుతుండేసరికి పాపం ప్రకాష్ రాజ్ జీర్ణం చేసుకోలేకపోతున్నారట.

