అయ్యో ఎంత అపార్ధం చేసుకున్నారండి!!

గత వారం రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినబడుతున్న న్యూస్ రవితేజ తమ్ముడు భరత్ ఆఖరి చూపుకు రవితేజ, అతని ఫ్యామిలీ వెళ్లలేదని ఒకటే రాద్ధాంతం జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రవితేజ ఏమిటండి ఇలా చేసాడు అంటూ పెద్ద చర్చే జరుగుతుంది. కానీ ఈ విషయమై రవితేజ ఫ్యామిలీనుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బాగా బలం వచ్చినట్టు అయ్యింది. అయితే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు భరత్ మరణంపై స్పందించాడు. అతనిలోని బాధను మీడియా ముఖంగా వెళ్లగక్కాడు.
తాను తన తమ్ముడు మీద ఎంత అభినం పెంచుకున్నాడో రవితేజ మాటల్లోనే విందాం... నేను నా తమ్ముడు నా ఫ్యామిలీ విడిపోలేదు. మేమంతా బాగానే వున్నాం. భరత్ చనిపోయే ముందు అతని బర్త్ డే ని మేమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాం. అలాగే నా పిల్లలకి తన బాబాయ్ భరత్ అంటే చాలా ఇష్టం భరత్ ని కూడా నాన్నే అని పిలుస్తారు. అలాగే భరత్ తో మేము విడిపోలేదు కలిసే ఉంటున్నాం. నేను భరత్ చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం నేను ఎవరైనా చనిపోతే చాలా ఎమోషనల్ అవుతాను.అలాగే ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా నేను వెళ్లి వాళ్ళని అలా చూడలేను. ఇక శ్రీహరి గారు చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పలకరిద్దామని వెళ్లి వాళ్ళ బాధ చూడలేక వెనక్కి వచ్చేసాను. అలాంటి నేను భరత్ ని అలాంటి పరిస్థితిలో చూడలేకే వెళ్ళలేదు. అసలు భారత్ చనిపోయిన ఫొటోస్ ని మేము టివి లో కూడా చూడలేదని చెప్పాడు. అంతేగాని అతనిపై ఎటువంటి కోపం లేదని చెబుతున్నాడు.
అలాగే భరత్ కి అంతిమ సంస్కారాలు చెయ్యడానికి మా ఫ్యామిలీ వెళ్లలేదని కూడా మీడియాలో తప్పుగా ప్రచారం జరిగింది. మా తమ్ముడు రఘు, భరత్ కి అంత్యక్రియలు చెయ్యకూడదని చెప్పబట్టే మా బాబాయ్ భరత్ కి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అంతేగాని ఇతరులు ఎవ్వరు భరత్ కి అంతిమసంస్కారాలు చెయ్యలేదు. అయినా మా బాబాయ్ ఎవ్వరికి తెలియదు కాబట్టే మీరు పొరబడి వుంటారు. ఇక నేను భరత్ చనిపోయిన నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్లానని... అక్కడ చాలా హ్యాపీగా వున్నానని కొందరు రాసారు. నేను ఒక్కడినే షూటింగ్ కి వెళ్లకుండా మానేస్తే నిర్మాతల పరిస్థితి ఏమిటండి. నా ఒక్కడి గురించి షూటింగ్ ఆగిపోతే వారెంత నష్టపోతారో మీరే చెప్పండి అంటూ తనలోని బాధను బయటికి వెళ్లగక్కాడు రవితేజ. మరి ఇలా చెబుతున్న రవితేజ ని చూస్తుంటే పాపం రవితేజ అని అనిపిస్తుంది కదూ.

