అమ్మో దిశానా?

తమిళంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ లో హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేక చిత్ర బృందం నానా తంటాలు పడుతుంది. ముందుగా సంఘమిత్ర ప్రాజెక్ట్ ని శృతి హాసన్ తో మొదలు పెట్టిన తర్వాత ఆమె అర్దాంతరంగా ఈ సినిమా తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్ళకుండా ఆగిపోయింది. అప్పటినుండి 'సంఘమిత్ర' పాత్రకు ఏ హీరోయిన్ ని సెట్ చేయలేకపోతోంది చిత్ర బృందం. ఒకసారి అనుష్క అని వార్తలొస్తే మరోసారి దీపికా అంటారు. ఇంకోసారి నీతూ చంద్ర అని... తర్వాత ఖుష్బూ, సుందర్ సి ఫ్యామిలీకి దగ్గరైన హన్సిక అంటారు. కానీ ఏ హీరోయిన్ ఈ సంఘమిత్రకి సెట్ కాలేదు.
అయితే ఇప్పుడు తాజాగా 'సంఘమిత్ర' కి హీరోయిన్ సెట్ అయినట్లుగా తెలుస్తుంది. 'లోఫర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీని ఈ 'సంఘమిత్ర' పాత్రకు ఎంచుకున్నారనే సమాచారము అందుతుంది. ముందుగా ఈ పాత్రకి శృతి హాసన్ ని సెలెక్ట్ చెయ్యడము, ఆ పాత్రకోసం ఆమెకి యుద్ధ విద్యలు నేర్పించడానికి లండన్ పంపడం జరిగింది. అమ్మడు ఆ యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాక ఆ పాత్ర చెయ్యను పొమ్మంది. అలా శృతి వెళ్ళాక చిత్ర బృందం తర్జన భర్జన మధ్యన దిశా పటానికి 'సంఘమిత్ర' రోల్ కోసం ఎంపిక చేసింది.
ఇక ఈ చిత్రంలో వీర వనిత - యోధురాలు పాత్రలో కనిపిస్తే దిశా పాటని కనబడితే..... ఆర్య, జయం రవిలు ఇతర ముఖ్యమైన పాత్రలు చెయ్యబోతున్నారు. అయితే దిశాని 'సంఘమిత్ర పాత్రకి ఎంపిక చేయడంపై అభిమానుల నుండి సర్వత్రా వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. ఎందుకంటే దిశా కి కేవలం గ్లామర్ ఆరబొయ్యడం తప్ప నటన విషయం లో వీక్. అలాంటి ఆమెని 'సంఘమిత్ర' రోల్ కి ఎలా ఎంపిక చేశారంటున్నారు.

