అమ్మడు కంట్రోల్ చేసుకోకపోతే...?

వరసగా రెండు సినిమాలు హిట్ అయితే అబ్బో ఆ హీరోయిన్ కి లక్కు బాగుంది.. ఇక చేతినిండా అవకాశాలే అంటారు. కానీ ఒకేఒక్క సినిమా ప్లాప్ అయ్యిందనుకోండి.. ఇక ఆ హీరోయిన్ కి అవకాశాలు వస్తాయంటే... నమ్మకమే లేదు.. అంతేకాదు ఆమెది ఐరెన్ లెగ్ అంటూ బిరుదులు కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు సేమ్ సిట్యువేషన్ ని క్యారీ చేస్తుంది కృష్ణగాడి లవర్ మెహ్రీన్ కౌర్. ఇండస్ట్రీలోకి రావడం రావడమే వరుసగా మూడు హిట్స్ అందుకుని లక్కీ హీరోయిన్ అయిన మెహరీన్ కి సన్నాఫ్ సూర్య... సినిమా ప్లాప్ షాకిచ్చింది.
కేవలం ఆ సినిమా ప్లాప్ అవడమే కాదు.. ఆ సినిమాలో మెహ్రీన్ ఉన్న సన్నివేశాలను సినిమా విడుదల తర్వాత కత్తెర వేసేశారంటే.. మెహరీన్ ఆ సినిమాలో ఎలా ఉందొ అర్ధమవుతుంది. ఆ సినిమాలో మెహ్రీన్ బొద్దుగా ఉందనే కామెంట్స్ పడ్డాయి. ఆమె మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్లో కూడా బొద్దుగా కనబడినప్పటికీ... గ్లామర్ షో చేయకపోవడంతో ఆమె ఇమేజ్ పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అమ్మడు నటించిన తాజా చిత్రం జవాన్ లో మాత్రం మాస్ లెక్కన బొద్దుగా కాదు కాదు లావుగా కనబడి చిరాకు పుట్టించిందనే కామెంట్స్ పడుతున్నాయి.
బి.వి.ఎం ఎస్ రవి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ -మెహరీన్ కౌర్ జంటగా వచ్చిన జవాన్ సినిమా గత శుక్రవారమే విడుదలై మిశ్రమ స్పందనతో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మైనస్ పాయింట్ మెహ్రీన్ అని చెప్పడం... ఆమె గ్లామర్ షో లో బాగా లావుగా కనబడిందనే కామెంట్స్ తోపాటు.. మెహ్రీన్ నటన జవాన్ లో తేలిపోయిందన్నారు. మరి సన్నాఫ్ సూర్య, జవాన్ ఇలా రెండు సినిమాల్లోనూ మెహ్రీన్ నటనకు, బొద్దుతననానికి మైనస్ మార్కులే పడ్డాయి. మరి మెహ్రీన్ కి ఇప్పడు కొత్తగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమాలో త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తున్నాడని టాక్ ఉండేసరికి ఎన్టీఆర్ అభిమానులు బెదిరిపోతున్నారు. ఎన్టీఆర్ పక్కన ఈ క్యూట్ బొద్దందాల భామ బాగొదంటున్నారు. అలాగే మెహ్రీన్ కాస్త వళ్ళు తగ్గించుకోకపోతే మరో నమిత అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్స్ కూడా పడుతున్నాయి.

