అమరావతిలో పద్మావతి

పద్మావతి సినిమా గురించి ఇప్పుడు దేశంలో పెద్ద చర్చే జరుగుతుంది . రాజపుత్ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ చిత్రం వున్నదని , దీన్ని విడుదల కానివ్వబోమని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ , దీపికా పదుకొనె కు అనేక బెదిరింపులు వస్తున్నాయి. రాజపుత్ కర్ణిసేన తో పాటు ఆదివారం భారతీయ జనతా పార్టీ హర్యానా నాయకుడు సూరజ్ పాల్ వీరి తలలకు వెలలు కూడా కట్టారు . ఈ నేపథ్యంలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనె ఆదివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు .
ప్రభుత్యం సోషల్ మీడియాలో ప్రజాదరణ ఉన్న ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేసింది .దీపికతో పాటు , హీరో రానా కూడా పాల్గొన్నాడు . వీరికి మంత్రి అఖిల ప్రియ అవార్డులను అందజేశారు . ప్రస్తుతం దీపికా పదుకొనెకు వున్న బెదిరింపులను దృష్టిలో పెట్టుకొనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఊహించని భద్రతను ఏర్పాటు చేశారు . యువతీ యువకులు పెద్ద సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమం చాలా సాఫీగా జరిగిపోయింది. దీపిక కూడా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

