అభిరాం ఎంట్రీకి సకలం సిద్ధం

ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి అంటే... రామానాయుడు మనవడిగా సురేష్ బాబు కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో గా నిలదొక్కుకున్నాడు రానా దగ్గుబాటి. కానీ రానా మాత్రం బ్యాగ్రౌండ్ తో కంటే తన స్వశక్తితోనే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. విలన్ వేషాలు, హీరో వేషాలు వేస్తూ ఇండస్ట్రీలో పాతుకుపోయిన రానా తోపాటు అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు దగ్గుబాటి వారసుడైన అభిరాం ని హీరో గా ఇండస్ట్రీలోకి లాంచ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అభిరాం కోసం కథను ఫైనల్ చేసే పనిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఉన్నట్టు తెలుస్తుంది.
త్వరలో అభిరాం నటించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకోబోతుండట. భాను శంకర్ దర్శకత్వం వహించబోయే ఆ సినిమాలో అభిరాం హీరోగా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ దగ్గుబాటి హీరో అభిరాం కి కరెక్ట్ గా సెట్ అయ్యేలా ఒక బ్యూటీ ఫుల్ హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసింది చిత్ర బృందం. మాళవిక వర్మ అనే హీరోయిన్ అభిరాం దగ్గుబాటి సరసన ఈ మూవీ లో గ నటించనుంది. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తరహాలో ఈ సినిమా ఉండబోతోందట.
మరి ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు ఫైనల్ గా సెట్ అవ్వడంతో త్వరలోనే రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో అధికారకంగా అభిరాం ఎంట్రీ ఇవ్వబోయే సినిమాను స్టార్ట్ చేయడానికి దగ్గుబాటి ఫ్యామిలీ సిద్దమైనట్లుగా వార్తలొస్తున్నాయి. మరి అభిరాం దగ్గుబాటి తన అన్న లాగ ఇండస్ట్రీ లో హీరో గా సెట్ అవుతాడా లేదా అనేది ఒక్క సినిమా తోనే అర్ధమైపోతుంది.

