అబ్బో హెబ్బాకి చాలానే ఉందిగా?

అలా ఎలా సినిమాలో హెబ్బా పటేల్ కనబడినా ఆమెకి కుమారి 21 ఎఫ్ సినిమా తోనే మంచి గుర్తింపు వచ్చింది. కుమారి లో సుకుమార్ హెబ్బకి ఇచ్చిన కేరెక్టర్ తోనే హెబ్బా పటేల్ ఒక్కసారిగా లైం లైట్ లోకొచ్చింది. రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్ జంటగా వచ్చిన ఈ సినిమాతోనే హెబ్బా హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఆ సినిమా హిట్ తో హెబ్బా పేరు మార్మోగిపోయింది. అయితే హెబ్బాకి ఇంతగా ఫెమ్ రావడానికి కారణం మాత్రం సుకుమార్. ఇక కుమారి 21 ఎఫ్ తర్వాత హెబ్బాకి ఆ రేంజ్ లో పేరు తెచ్చిన సినిమాలేవీ రాలేదు. కాస్త రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలే అమ్మడుకి కాస్తో కూస్తో పేరు తెచ్చాయి.
అయితే తనకి మంచి లైఫ్ ఇచ్చిన సుకుమార్ తన సినిమాలో ఒక పాత్ర చెయ్యమని అడిగితె హెబ్బా నో చెప్పిందనే టాక్ వినబడుతుంది. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే.... సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం మూవీ లో రామ్ చరణ్ - సమంత జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది. అయితే అనసూయ పాత్రకి ముందుగా సుకుమార్ హెబ్బా పటేల్ ని సంప్రదించాడట. కానీ ఆ పాత్ర నిడివి మరి తక్కువ ఉండడం వలన ఆ పాత్ర చేయలేనని హెబ్బా, సుకుమార్ తో చెప్పేసిందట.
ఇక హెబ్బా పటేల్ నో చెప్పగానే ఆ పాత్రకి అనసూయని ఎంపిక చేశారట. మరి ప్రస్తుతం హెబ్బా చేతిలో చిన్న హీరో నాగ అశ్విన్ సినిమా తప్ప మరే పెద్ద ప్రాజెక్ట్ కూడా లేదు. మరి ఇలాంటి టైం లో హాట్ టాపిక్ గా... భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రంగస్థలంలో చిన్న పాత్ర అయినా వేసుంటే మళ్ళీ హెబ్బా పటేల్ కి కాస్త కలిసొచ్చేదే కానీ.... వద్దనుకుని ఇప్పుడు మరో సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తుంది.

