అబ్బో అరిపించేసిందిగా..!!

టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ బికినీ వేస్తున్నారు అంటే ఆ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఆ సినిమాలో... ఆ బికినిలో... ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో అంటూ తెగ చర్చలు జరిగిపోతుంటాయి. కాకపోతే కొన్ని సినిమాల్లో బికినీ షాట్స్ మాత్రం పెద్దగా హైలెట్ చెయ్యకుండా అలా పెట్టి పెట్టనట్లు పెడుతుంటారు. ఈ మధ్యనే 'దువ్వాడ జగన్నాథం' చిత్రంలో పూజ హెగ్డే స్విమ్ సూట్ లో అదరగొట్టి పడేసింది. ఎటువంటి బెరుకు లేకుండా టు పీస్ బికినితో రచ్చ చేసి నేను గ్లామర్ చెయ్యడానికి సిద్ధం అంటూ చెప్పకనే చెప్పేసింది.
ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి రావడానికి నానా తంటాలు పడుతున్న కేథరిన్ తెరిస్సా స్టార్ హీరోల పక్కన నటించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నది. అందుకే ఈసారి అందాల ఆరబోతలో అడ్డు అదుపులేకుండా చెలరేగిపోయింది. కేథరిన్ తెరిస్సా నటించిన తాజా చిత్రం 'గౌతమ్ నందా'లో కేథరిన్ బికినీలో రెండుసార్లు మెరిపించింది. కేథరిన్ నల్ల రంగు సింగిల్ పీస్ బికినీలో అలా అలా వయ్యారంగా స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తుంటే.. అబ్బో ఆ సీన్ చూసిన కుర్రకారు కుర్చీల్లో కూర్చోలేక విజిల్స్ మీద విజిల్స్ తో థియేటర్స్ అంతా అదరగొట్టేసారు. ఇక కేథరిన్ బికినీ షో కాస్త లెంగ్దిగా ఉండడంతో బికినీ ప్రేమికులు రెచ్చిపోయి పండగ చేసేసుకుంటున్నారు..
ఇక కేథరిన్ మాత్రం బికినిలో ఎటువంటి బెరుకు లేకుండా నటించేసి అదరగొట్టేసిందనే కామెంట్స్ ఫుల్ గా పడుతున్నాయి. మరి ఎంతగా బికినిలో మెప్పించినా కేథరిన్ కి టాప్ స్టార్ సినిమాలో మాత్రం సింగిల్ హీరోయిన్ ఛాన్స్ దక్కుతుందంటే అస్సలు నమ్మకమే లేదంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా...కేథరిన్ చేసిన సినిమాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ గానే చేసింది. ఇపుడు కేథరిన్ నటించిన 'గౌతమ్ నందా' విడుదల కాగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలోనూ కేథరిన్ సెకండ్ హీరోయినే.

