అబ్బే అది అదే... ఇది ఇదే..

రామ్ గోపాల్ వర్మ హడావిడి మాములుగా లేదు. మనోడు ఎప్పుడూ మీడియాలో నానుతుండకపొతే అస్సలు నిద్ర పట్టదు. ఇక ఇప్పుడు తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ హడావిడి అంతా ఇంతా కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్మెంట్ మొదలు, ఫస్ట్ లుక్ తోనూ, ఆ సినిమా నిర్మించే నిర్మాత విషయంలోనూ రామ్ గోపాల్ వర్మ హడావిడి మాములుగా లేదు. ఎప్పుడూ ప్రకటనలతో ఆగిపోయే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం పట్టు వదలడంలేదు. మొన్నటివరకు టిడిపి నేతలు వర్మ పైత్యం పనికిరాదని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో పునరాలోచించుకోవాలని వర్మకి వార్నింగ్ ఇచ్చారు.
అయినా బెదరని వర్మ మరోమారు టిడిపి నేతలను రెచ్చగొట్టాడు. లక్ష్మి పార్వతికి ఫెవర్ గా సినిమా తియ్యడానికి ఫిక్స్ అయిన వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత విషయంలోనూ మళ్ళీ రాజకీయ నేతలను కెలుకుతున్నాడు. వైసిపి ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిర్మిస్తాడని అధికారిక ప్రకటన ఇచ్చేసాడు. వర్మ... ఈ సినిమాతో మళ్ళీ రచ్చ స్టార్ట్ అయ్యింది. వచ్చే ఎన్నికలో టిడిపిని దెబ్బకొట్టడానికి వైసిపి పార్టీతో వర్మ చేతులు కలిపి చంద్రబాబు నాయుడు మీద లేనిపోనివి కల్పించి సినిమా మొత్తం టిడిపికి వ్యతిరేఖంగా... లక్ష్మి పార్వతికి అనుకూలం గా తెరకెక్కిస్తాడనే రచ్చ స్టార్ అయ్యిందని టిడిపి నేతల ఆరోపణ. అయితే వైసిపి ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి మాత్రం తాను ఎన్టీఆర్ సినిమా తియ్యడానికి వర్మ చెప్పిన కథ నచ్చిందని.. అసలు రాజకీయాలకు ఈ సినిమాకి ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాడు.
అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ నచ్చడంతోనే సినిమాని నిర్మిస్తున్నాని చెబుతున్న రాకేష్ రెడ్డి ఈ సినిమా మొత్తం రాజకీయాలకు అతీతంగా... ఎన్టీఆర్ రెండో పెళ్లితర్వాత జరిగిన ఘటనలను, వాస్తవాలను మాత్రమే సినిమాలో చూపిస్తానని వర్మ తనకి మాటిచ్చాడు కాబట్టే సినిమాని నిర్మిస్తున్నానని... అలాగే సినిమాకి సంబందించిన టెక్నీషియన్స్ విషయంలోనూ, నటీనటుల ఎంపికలోనూ వర్మదే పూర్తి బాధ్యత అని చెబుతున్నాడు. మరి రాజకీయాలను టచ్ చెయ్యకుండా ఎన్టీఆర్ జీవితమే లేదు. ఇక వర్మ ఎలా ఈ సినిమాని తెరకెక్కిస్తాడో చూద్దాం.

